SSMB 29: ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా SSMB 29. మొదటిసారి మహేష్ బాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు చూడడానికి హాలీవుడ్ కటౌట్ లో అనిపిస్తాడు. అని ఏ రోజు కనీసం బాలీవుడ్ సినిమా కూడా చేయలేదు. దానికి కారణం ఏంటంటే తెలుగులో చేయాల్సింది చాలా ఉంది అని చెబుతూ ఉంటాడు.
అలానే మహేష్ బాబు లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎప్పుడూ రీమేక్ ఫిలిం చేయడం. సినిమా అనేది ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్ లా అనిపించాలి. ఒకవేళ నేను రీమేక్ చేస్తే ఒరిజినల్ యాక్టర్ నా మైండ్ లో ఉంటాడు. నేను దాన్ని ఎంజాయ్ చేయలేను అని చెబుతుంటాడు. ఎట్టకేలకు మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది.
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
అసలు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే విపరీతమైన అంచనాలు ఉంటాయి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది కాబట్టి ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో అప్డేట్ ఏమీ రావట్లేదు అని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా అది కన్ఫామ్ అయిపోయినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ రావడం లేదు అంటే కొద్దిపాటి నిరాశ కలిగించే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మరోవైపు మహేష్ బాబు నటించిన క్లాసిక్ సినిమా అతడు రీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు.
అప్పట్లో నో కమర్షియల్ సక్సెస్
అతడు సినిమా అప్పట్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ టీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ ను సినిమా నమోదు చేసుకుంటుంది. ఈ సినిమాని త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ఆ రోజుల్లోనే త్రివిక్రమ్ ఈ రేంజ్ సినిమా తీసాడు అంటే చాలామంది ఆశ్చర్యపడిపోయారు. మహేష్ బాబు తో చేసిన సినిమాలు త్రివిక్రమ్ కి ఎప్పుడు ప్రత్యేకమే. ఆ సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ఇప్పుడు చూస్తుంటే క్లాసిక్ లా అనిపిస్తాయి. మహేష్ తో సినిమా చేసిన ప్రతిసారి ఒక కొత్త నటుడిని త్రివిక్రమ్ బయటికి తీస్తాడు.
Also Read: Lokesh Kanagaraj: లియో ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ పై డైరక్టర్ లోకేష్ రియాక్షన్