Lucky Zodiac Signs 2025: సూర్యుడు సింహరాశిలోకి ఆగస్టు 17 న తెల్లవారుజామున 1:41 గంటలకు ప్రవేశిస్తాడు. గొప్ప విషయం ఏమిటంటే ఛాయా గ్రహం అయిన కేతువు కూడా అప్పటికే అక్కడ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో.. సింహరాశిలో సూర్యుడు, కేతువుల కలయిక జరుగుతుంది. ఇది కొన్ని రాశి రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు ఒక ముఖ్యమైన గ్రహం. అంతే కాకుండా సూర్యుడు ఆత్మ, గౌరవం, తండ్రి, నాయకత్వ సామర్థ్యం యొక్క కారకం కాబట్టి.. ఈ రంగాలలో పలు రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ధన లాభం కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి సూర్యుడు, కేతువు కలయిక ప్రత్యేకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కోరుకున్న విధంగా పనిని పూర్తి చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ కాలంలో వ్యాపార ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పరంగా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటన లేదా కొత్త ప్రదేశం నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త పని ప్రారంభించినట్లయితే.. ఇప్పుడు మీకు లాభం లభిస్తుంది. వివాహ జీవితంలో ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. ఒంటరి వ్యక్తులు తమకు కావలసిన వ్యక్తిని కూడా కలుసుకోవచ్చు.
వృశ్చిక రాశి:
సూర్యుడు, కేతువుల కలయిక మీ కెరీర్‌లో మంచి మార్పులను తీసుకువస్తుంది. మీరు ఏదైనా కోర్సులో చేరినట్లయితే.. అది మంచి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఈ సమయంలో.. మీ పని శైలి , కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఆకట్టుకుంటాయి. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు కూడా లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడి ప్రభావం కారణంగా.. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవితంలో సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో మీరు కోరుకున్న లాభం పొందుతారు.
Also Read: శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు మీ సొంతం
మకర రాశి:
ఈ సమయం మకర రాశి వారికి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారం లేదా ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దానిలోని అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా పరిపాలన, రాజకీయాలు లేదా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ కలయిక నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. కళలో మెరుగుదల మీకు సమాజంలో మంచి గుర్తింపును ఇస్తుంది. అందరి మద్దతు, సహకారం పొందిన తర్వాత మీరు మానసికంగా బలంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. అంతే కాకుండా డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.