Pawan Kalyan: ఇటీవల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు, పలువురు ఎగ్జిబిటర్లు జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బందుకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా 12వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్లో బంద్ అని పిలుపునివ్వడంతో పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం మొత్తం నలుగురు ప్రొడ్యూసర్ల కను సన్నల్లోనే జరిగిందని ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవడం కోసమే ఇలా థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
థియేటర్లు బంద్..
ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినీ ఇండస్ట్రీని తప్పు పట్టారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నేను పాటుపడుతుంటే కూటమి ప్రభుత్వము వచ్చి ఏడాది అవుతున్న సినీ సంఘాలు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడుని కలవలేదు. ఇకపై మీ వ్యక్తిగత విషయాలు గురించి మమ్మల్ని కలవద్దు అంటూ ఒక లెటర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే ప్రొడ్యూసర్లైన అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ థియేటర్లు బంద్ గురించి ఎక్కడ అధికారకంగా తెలియచేయలేదని ఇది కొంతమంది తప్పుగా చిత్రీకరించడంతో ఆయన వరకు వెళ్లిందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వ్యక్తి..
దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. ఇక మిగిలింది సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు ఇద్దరి ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం అయితే తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కమిటీ (TFCC)ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత సునీల్ నారంగ్ థియేటర్ల బంద్ ఇష్యుపై క్లారిటీ ఇచ్చారు. ఇది కొంతమంది ఉద్దేశపూర్వకంగా సృష్టించినది తప్ప మేము థియేటర్ల బంద్ పిలుపు ఇవ్వలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. అతని సినిమాలను ఆపడం ఎవరి తరం కాదని సునీల్ నారంగ్ తెలిపారు.
నరేంద్ర మోడీ..
పవన్ కళ్యాణ్ గారి గురించి స్వయంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆయన ఒక తుఫాన్ అని చెప్పారు. అలాంటి వ్యక్తి సినిమా వస్తుంది అంటే మేము థియేటర్లు ఎందుకు బంద్ చేస్తామని సునీల్ నారంగ్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కమిటీ జనరల్ సెక్రెటరీ శ్రీధర్ కూడా మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందని మేము ఈ నెల మొత్తం థియేటర్లన్నీ ఖాళీగా పెట్టుకున్నాము. ఇప్పుడు సినిమా వాయిదా పడింది .ఈ నెల మొత్తం మాకు సినిమాలు లేక నష్టాలు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా థియేటర్లు బంద్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. ఈ థియేటర్ల బంద్ పిలుపు వెనక ఇద్దరు ప్రొడ్యూసర్లు దర్శకులు ఉన్నారని ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఇలా థియేటర్ బంద్ వెనక ప్రొడ్యూసర్లు దర్శకులు ఉన్నారని చెప్పినప్పటికీ వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే ప్రశ్న జనరల్ సెక్రెటరీ శ్రీధర్ కి ఎదురయింది. టైం వచ్చినప్పుడు వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అప్పుడు వారికి 100% రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలియజేశారు. దీంతో ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లు, దర్శకులు ఎవరా అంటూ చర్చలు మొదలయ్యాయి.