AMB cinemas : ప్రేక్షకులు థియేటర్ కు రావడం మానేశారు. ఓటిటిలో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయారు. ఒక పెద్ద హీరో సినిమా వస్తే కానీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలావరకు సింగిల్ స్క్రీన్స్ మూత పడిపోయాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల సినిమాలు క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక పెద్ద హీరో సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలకి ఒక సినిమా రావడమే గగనం అయిపోయింది. దీనివలన ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం మానేశారు. ఒక చిన్న సినిమా వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించుకుంటే దానికి కొద్దిగా గొప్ప ఆడియన్స్ రావడం మొదలయ్యారు. అంతేకానీ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం అనేది గగనం.
బెంగళూరు అండ్ చెన్నైలో మహేష్ బాబు థియేటర్స్
హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో క్యూరియాసిటీతో ఉంటారు. హైదరాబాదులో ఎన్ని థియేటర్స్ ఉన్నా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తారు. సంధ్యా, సుదర్శన్ వంటి థియేటర్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలానే గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబి థియేటర్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మహేష్ బాబు సినిమాలన్నీ మాక్సిమం అక్కడ చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు చాలామంది ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఏఎంబి థియేటర్స్ ను కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా బెంగళూరు మరియు చెన్నైలో కూడా పెట్టే ప్లాన్ లో ఉన్నారు ఏషియన్ సినిమా అధినేత.
వైజాగ్ అల్లు అర్జున్ థియేటర్స్
హైదరాబాదులోని సత్యం థియేటర్ కు ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండేది. నాని కూడా అక్కడ సినిమా చూడటం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ థియేటర్ ఇప్పుడు లేదు. అదే ప్లేస్ లో త్రిబుల్ ఎ థియేటర్ వచ్చింది. ఇది అల్లు అర్జున్ థియేటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ ట్రిపుల్ ఏ ను వైజాగ్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు ఏసియన్ సునీల్ క్లారిటీ ఇచ్చారు. అలానే ఐమాక్స్ థియేటర్ను కూడా హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు ఎగ్జిట్ డ్యూటీలకు డిస్ట్రిబ్యూటర్లకు చాలా థియేటర్ల సమస్య వస్తే ఇప్పుడు కొత్తగా మరిన్ని థియేటర్స్ ను వ్యాప్తి చేసే పనిలోపడ్డారు ఏషియన్ సునీల్. ఇక రానున్న కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండే అవకాశం లేదు.
Also Read: Tamil filmmakers : అంత పొటెన్షియల్ ఉన్న నటుడికి ఒక్క హిట్ ఇవ్వలేకపోతున్నారు