BigTV English

Ola Electric : ఒక్క నెలలోనే 18 వేల యూనిట్ల అమ్మకం.. ఓలా సంచలనం..

Ola Electric : ఒక్క నెలలోనే 18 వేల యూనిట్ల అమ్మకం.. ఓలా సంచలనం..
Ola Electric


Ola Electric : ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కార్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ బైకులు కూడా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి.. కార్ల కంటే ఎలక్ట్రిక్ బైక్స్‌కే మార్కెట్లో ఎక్కువ క్రేజ్ ఉంది. 2 వీలర్‌ను కొనాలనుకునే కస్టమర్లు చాలామంది ఈ ఎలక్ట్రిక్ బైక్స్‌పై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విడుదలయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్ సేల్స్.. ఈ క్రేజ్‌ను మరోసారి అందరికీ నిరూపిస్తున్నాయి.

కేవలం జూన్ 2023లోనే మొత్తంగా 18 వేల యూనిట్లను అమ్మింది ఓలా ఎలక్ట్రిక్. ప్రస్తుతం ఇండియాలోని ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ షేర్ 40 శాతంగా ఉంది. ఓలా మార్కెట్ షేర్‌ను సంపాదించుకునే విషయంలో ముందు నుండే యాక్టివ్‌గా ఉందని, సేల్స్ విషయంలో కూడా పర్వాలేదనిపించిందని యాజమాన్యం చెప్తోంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్ ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించామని అంటోంది.


జులైలోకి ఎంటర్ అవుతున్న క్రమంలో ఎస్1 ఎయిర్‌ విషయంలో కస్టమర్లకు మరింత మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ఓలా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో 750 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు (ఈసీ)లను ప్రారంభించింది ఓలా. త్వరలోనే ఈ సంఖ్యను 1000కు పెంచాలని సన్నాహాలు చేస్తోంది. ఇవి ఓలా కస్టమర్లకు ఎన్నో విధాలుగా సహాయపడతాయి. జూన్‌లో సబ్సిడీలను రివైజ్ చేసిన కారణంగా ప్రస్తుతం మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో ధర రూ. 1,39,999 అని తెలుస్తోంది. ఎస్1 (3కేడబ్ల్యూహెచ్) ధర రూ. 1,29,999, ఎస్1 ఎయిర్ (3కెడబ్ల్యూహెచ్) రూ.1,09,999 అని తెలుస్తోంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×