BigTV English

Panchopachara Pooja Vidhanam  : పంచోపరచార పూజ ఎలా చేయాలంటే…

Panchopachara Pooja Vidhanam  : పంచోపరచార పూజ ఎలా చేయాలంటే…

Panchopachara Pooja Vidhanam  : హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం దేవతారాధన చేస్తుంటాం. పూజల్లో ప్రధానంగా వినిపించేది షోడశోపచార పూజలు అయితే ఇది అందరికీ అన్ని వేళలా వీలుకావు. దీనికి ప్రత్యామ్నాయంగా చేసేదే పంచోపచార పూజలు. ఐదు కలిపి చేసే ఉపచారాలకు పంచోపచార పూజలు అంటారు. విగ్రహాలు శుభ్రంగా కడిగి, తుడిచి, అప్పుడు గంధం బొట్టు పెట్టాలి. అనామిక వ్రేలితో దేవుడికి గంధమును సమర్పించవలెను. తర్వాత పరికల్పన చేయాలి. అంటే దేవుడి ఇచ్చిన భూమి మీద మనం ఉండ గలుగుతున్నాం. అలాంటి పరమాత్మకుడికి మనం ఏం ఇచ్చినా..ఏం చేసినా తక్కువే. గంధంతో పూజ తర్వాత పువ్వలతో స్వామిని ఆరాధించాలి.


గంధం బొట్లు తర్వాత పుష్పాలు పెట్టాలి. పుష్పం అంటే ప్రాణం. ఎవరైతే నీటి యందు ప్రాణశక్తి నిగుడీకృతం అయిందని తెలుసుకుంటారో వారే ప్రాణాన్ని పొందే అర్హత కలిగి ఉంటారు. వాళ్లే ప్రాణిగా గుర్తింపపడుతున్నారని వేద ధర్మం చెబుతోంది. అందుకే దేవుడకి పుష్పాలతో పూజ చేయాలి. దేవుడికి మనం సమర్పించే పువ్వు మన ప్రాణం. ఆ పువ్వులన దేనిముద్రలో ఉన్న వేళ్లతోనే పువ్వులను సమర్పించాలి. అలా చేస్తే పుష్పం పరికల్పన చేసినట్టు అవుతుంది. ఆకాశంలోకి కోటాను కోట్ల నక్షత్రాలే దేవుడికి పుష్పాలు. అలాంటి పరమాత్ముడికి పుష్పలు ఏపాటివి..

పంచోపచార పూజల్లో మొదటిది గందం, రెండు పువ్వులు, మూడోది దూపంతో పూజ. అగరబత్తీలతో స్వామికి పూజచేయాలి. మనం సాధారణ మనుషులం. చాలామందికి శ్లోకాలు, మంత్రాలు రావు. అలాంటి వారు స్వామి అని నిష్కంలకరమైన మనస్సుతో దేవుడ్ని తలుచుకుంటాం. ప్రశాంతమైన మనస్సుతో స్వామిపై మనకు ఉండాల్సిన భక్తి కాదు ప్రేమ. చెప్పాలంటే చేయాల్సింది పెద్ద పెద్ద పూజలు కాదు మానసిక పూజ. ఇది ప్రధానం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దూపంతో పూజ తర్వాత దీపం వెలిగించాలి. చివరల్లో మీ శక్తి కొద్ది దేవుడికి నైవేద్యం సమర్పించాలి. ఇలా ఐదు రకాలుగాచేసే పూజను పంచోపచారము అంటారు.


పంచోపచారంతో రెండో పద్దతి కూడా ఉంది. ఈ విధానంలో దేవుణ్ణి మనసారా ధ్యానించాలి. తర్వాత ధ్యానించిన దేవుణ్ణి ఆవాహన చేయాలి..ఆవాహన చేసిన దేవునికి నైవేద్యం సమర్పించుకోవాలి.0
నైవేద్యం తర్వాత నీరాజనం సమర్పించాలి. నీరాజనం చేసి నమస్కారం ఆచరించాలి. ఇలా ఏదో ఒక పద్ధతిలో భగవత్‌ ఆరాధన భక్తి, శ్రద్ధలతో ఆచరించాలి.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×