BigTV English

Waltair Veerayya: వాల్తేరు వీర‌య్య ర‌న్ టైమ్ ఫిక్స్…

Waltair Veerayya: వాల్తేరు వీర‌య్య ర‌న్ టైమ్ ఫిక్స్…

Waltair Veerayya:ఈ సంక్రాంతికి బ‌రిలోకి దిగే స్టార్లు ఎవ‌ర‌య్యా అని ఎవ‌రిని అడిగినా వినిపిస్తున్న రెండు పేర్లు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ‌. కొత్త సంవ‌త్స‌రం ద‌గ్గ‌ర ప‌డుతోంది. సంక్రాంతి సంద‌డికి నాంది ప‌లుకుతున్నాయి రోజులు. అందుకే స్టార్లు ఇద్ద‌రూ పోటాపోటీగా అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. మ‌రోవైపు అన్ అఫిషియ‌ల్‌గా మెగాస్టార్ చిరంజీవి సినిమా ర‌న్ టైమ్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రుతిహాస‌న్ హీరోగా న‌టిస్తున్న మాస్ కా మాస్ట‌ర్ సినిమా వాల్తేరు వీర‌య్య‌. బాబీ డైరక్ష‌న్ చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌ళ్ల లుంగీ, బీడీ నుంచి చిరు లుక్‌కి మాస్ జ‌నాల్లో కిర్రాకు లేపే విజిల్స్ వినిపిస్తున్నాయి. దానికి తోడు పాట‌లు కూడా పాపుల‌ర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ర‌న్ టైమ్‌ని 2 గంట‌ల 35 నిమిషాల‌కు ఫిక్స్ చేశార‌ని టాక్‌.


ఈ చిత్రంలో చిరంజీవి మాత్ర‌మే కాదు రవితేజ కూడా కీ రోల్ చేస్తున్నారు. అన్న‌య్యకు సపోర్ట్ గా న‌టిస్తున్నాన‌ని ర‌వితేజ చెప్పినా, ఆయ‌న ర‌న్ టైమ్ మీద కూడా క్యూరియాసిటీ ఉంది. ర‌వితేజ స్క్రీన్ టైమ్ 45 నిమిషాలు ఉంటుంద‌ట‌. అయితే వారిద్ద‌రూ క‌లిసి స్క్రీన్ మీద క‌నిపించినంత సేపు ర‌చ్చ ర‌చ్చ చేస్తార‌ట ఫ్యాన్స్. అంత మాసీగా తెర‌కెక్కించార‌ట బాబీ. వారిద్ద‌రి కాంబో సీన్లు ఆడియ‌న్స్ కి రియ‌ల్ ఫెస్టివ‌ల్‌ని చూపిస్తాయ‌ని అంటున్నారు యూనిట్ వ‌ర్గాలు. త్వ‌ర‌లోనే థ‌ర్డ్ సింగిల్ కి కూడా రెడీ అవుతున్నారు మెగాస్టార్ అండ్ దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఆల్రెడీ రిలీజైన రెండు పాట‌లు చార్ట్ బ‌స్టర్స్ అవుతున్నాయి. ఫ్రాన్స్ లో తెర‌కెక్కించిన నువ్వు శ్రీదేవి అయితే, నేను చిరంజీవి అవుతా నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×