BigTV English

IND Vs ENG Second Test Team News : ఉండేవారెవరు? వెళ్లేవారెవరు? విశాఖతో రెండో టెస్ట్ కు సర్వం సిద్ధం..!

IND Vs ENG Second Test Team News : ఉండేవారెవరు? వెళ్లేవారెవరు? విశాఖతో రెండో టెస్ట్ కు సర్వం సిద్ధం..!

IND Vs ENG Second Test Team News : విశాఖపట్నంలో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న రెండో టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఆట కన్నా, జట్టు వ్యూహాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇంగ్లాండ్ బజ్ బల్ వ్యూహంతో వస్తే ఎలా బౌలింగ్ చేయాలి. ఒలిపోప్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు కొడితే ఎలా బౌలింగ్ చేయాలి? వీటిపై  టీమ్ ఇండియా ఫోకస్ పెడుతోంది.


మొదటి టెస్ట్ లో ఓటమితో తలబొప్పికట్టిన టీమ్ ఇండియాకి గాయాల బెడద పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ స్క్వాడ్ లో ఎవరు ఉంటారు? ఎవరు వెళతారు? అనేది పెద్ద తలనొప్పిగా మారింది. రజత్ పటేదార్? సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనేది పెద్ద చిక్కుముడిగా మారింది. ఇద్దరికీ ఆరంగ్రేటమ్ మ్యాచ్ కావడం వల్ల సమస్యగా మారింది.

ఒకవేళ  కొహ్లీ, కేఎల్ రాహుల్ ప్లేస్ లో ఇద్దరు కొత్తవారితో ప్రయోగం సరికాదని అంటున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరే ఉంటారని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నాడు. వాళ్లిద్దరూ మంచి ఆటగాళ్లని తెలిపాడు. ఈ విషయంలో తుది నిర్ణయం కెప్టెన్, హెడ్ కోచ్  తీసుకుంటారని అన్నాడు.


పిచ్ ని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని అన్నాడు. విశాఖ పిచ్ ను అంచనావేయడం కష్టమేనని అన్నాడు. స్పిన్ కు అనుకూలిస్తుంది. అయితే తొలిరోజు బ్యాటింగ్ కి అనుకూలించవచ్చునని అన్నాడు. ఇక్కడ కూడా టాస్ కీలకమేనని అన్నాడు. భారత్ లో ఆడుతున్నాం, ఇవన్నీ మనకు తెలిసిన పిచ్ లు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనవారి మీద పనిచేసిందని అన్నాడు. ఇప్పుడు వాస్తవాలు బోధపడ్డాయి, ప్రత్యర్థుల బలాబలాలు తెలిసాయని అన్నాడు.

ఇక 11 మంది జట్టులో ఉండే సభ్యుల వివరాలను మాత్రం ఎవరూ చెప్పడం లేదు. కానీ సీనియర్లు చెప్పడం చూస్తుంటే శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరికి ఆఖరి అవకాశం ఇవ్వవచ్చునని అంటున్నారు. ఈ సారి ఫెయిల్ అయితే, మళ్లీ వాళ్లు ఎప్పటిలా రంజీలు, ఐపీఎల్ ఆడి నిరూపించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఓపెనర్లుగా వస్తారు. ఫస్ట్ డౌను నుంచి వరుసగా గిల్, రజత్ పాటేదార్ / సర్ఫరాజ్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, అశ్విన్, బుమ్రా వరకు పక్కా అంటున్నారు.

మరో ఇద్దరు మిగిలారు. మరో స్పిన్నర్ కావాలి. కులదీప్? వాషింగ్గన్ సుందర్, సౌరభ్ కుమార్ ఉన్నారు. పేసర్లు కావాలంటే సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు. నలుగురు స్పిన్నర్లు అంటే కులదీప్, వాషింగ్టన్ సుందర్ ఉంటారు. కాదు ఒక్కరే స్పిన్నర్ అంటే కులదీప్ కి అవకాశాలెక్కువగా ఉన్నాయని సీనియర్లు చెబుతున్నారు. పేసర్ కావాలంటే ముఖేష్ కుమార్ రావచ్చునని చెబుతున్నారు.  

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×