BigTV English

Parijata Flowers : పారిజాత పుప్వులని కోయకూడదా…?

Parijata Flowers : పారిజాత పుప్వులని కోయకూడదా…?

Parijata Flowers : దేవుడి పూజకి ఎన్నో రకాల పువ్వుల్ని వినియోగిస్తాం. కాని చాలా కొన్ని రకాలు పూజకి పనికి రావని పెద్దలు చెప్పారు. కొన్ని రకాల పువ్వులను అయితే అసలు చెట్టు నుంచి కూడా కోయకూడదు. ఇంకొన్ని పూలను అయితే చెట్టు నుంచి పూలు రాసినప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని కోయకూడదు. పారిజాత పువ్వుల విషయానికి వస్తే ఆ పుప్వులను చెట్టు నుంచి కోయకూడదన్న నియమం ఉంది. నేల మీద పడిన పుష్పాలను మాత్రమే తీసుకోవాలి. భాగవతంలో పారిజాత పువ్వుల ప్రస్తావన ఉంది.


నారదుడు పారిజాత పువ్వులను రుక్మిణికి తెచ్చి ఇచ్చారన్న సంగతి సత్యభామకి కోపం వచ్చి అలిగిందట. ఆమె కోపాన్ని చల్లార్చేందుకు శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఇంటి పెరట్లో నాటతానని ప్రతిజ్ఞ చేశాడట. దేవతలతో యుద్ధం చేసి దేవలోకం నుంచి పారిజాత చెట్టును శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడని పురాణం చెబుతోంది. శ్రీకృష్ణుడు ఆ చెట్టును భూలోకానికి తేక ముందు దేవలోకానికి చెందిన మొక్కగానే ఉండేది. భూమిని తాకినప్పుడు మాత్రమే ఆ మొక్క భూలోకానికి చెందినదిగా మారుతుంది. అందుకే ఆ మొక్క నుంచి పువ్వులు నేరుగా కోయకూడదంటారు. పువ్వులు దానంతట అవే రాలి భూమిని తాకినప్పుడు మాత్రమే పూజకి పనికి వస్తాయి. పారిజాత మొక్కను పూజిస్తే కోరిన కోరికల నెరవేరతాయన్న విశ్వాసం ఉంది.

బంగారం, తెలుపు రంగులో ఉన్న పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. పురాణాల్లో ఈ పుష్పాలను శివపూజకి ఉపయోగించారని పేర్కొన్నాయి.. అందుకే సోమవారం నాడు ఈ చెట్టుకి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయని నమ్ముతుంటారు. పారిజాత పువ్వులతో సోమవారం నాడు శివుడ్ని పూజిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఈ చెట్టుకి ఒక దారంకట్టి కోరిక కోరుకుంటనే నెరవేరుతుందని ఉత్తరాదిన బాగా నమ్ముతారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు విశిష్టత ఉంది. ఆకుల రసాన్ని వేడినీళ్లలో వేసి మరిగించి తాగిస్తే విరోచనాలు తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.. ఈ చెట్టు పూల నుంచి మంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు.


Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×