BigTV English

Plastic-Recycling Machine : ప్లాస్టిక్‌ను నివారించే యంత్రం.. ప్రయోగం సక్సెస్..

Plastic-Recycling Machine : ప్లాస్టిక్‌ను నివారించే యంత్రం.. ప్రయోగం సక్సెస్..

Plastic-Recycling Machine : ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని, దానిని వినియోగించడానికి ఆపాలని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎంతగా హెచ్చరించిన ఎలాంటి మార్పు లేదు. మనుషుల జీవితాల నుండి ప్లాస్టిక్‌ను దూరం చేయడం అసాధ్యంగా మారింది. అందుకే శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ను నివారించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.


ప్లాస్టిక్‌ను ఎంత ధ్వంసం చేసినా అది మళ్లీ తిరిగొస్తూనే ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలుగా దీని పూర్తి నివారణకు పరిష్కారం ఏంటి అని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కృత్రిమ మేధస్సు (ఏఐ), కెమికల్ ఇంజనీరింగ్, సింథటిక్ బయోలిజీని ఉపయోగించి వారు ఓ యంత్రాన్ని తయారు చేశారు. దాని పేరే ‘పెటేస్’. అంటే ప్లాస్టిక్‌ను తినే మెషీన్.

పెట్ అంటే పాలిథిలీన్ టెరెఫ్తలెట్ అని అర్థం. లైట్‌వెయిట్ ప్లాస్టిక్‌కు ఇది కెమికల్ నేమ్. ఇలాంటి ప్లాస్టిక్‌ను తింటుంది కాబట్టి ఆ మెషీన్‌కు పెటేస్ అనే పేరుపెట్టారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్‌ను ఏ వాతావరణంలో అయినా ధ్వంసం చేయడానికి పెటేస్ నుండి ఫాస్ట్ పెటేస్ అనే మరో మెషీన్‌ను కనుగొన్నారు. భూ భాగం మొతాన్ని 8 శాతం ప్లాస్టిక్ వేస్ట్ ఆక్రమించుకోవడంతో ఈ పరిశోధన పర్యావరణానికి చాలా సహాయపడనుంది.


దాదాపు 90 శాతం ప్లాస్టిక్‌ను ధ్వంసం చేయడం కష్టం కావడంతో అదంతా కెమికల్‌గా మారి పర్యావరణానికి హాని కలిగించేలా మారింది. ఒకవేళ దానిని ధ్వంసం చేయాలన్నా దాని నుండి వెలువడే గ్యాస్‌లు కూడా పర్యావరణాన్ని హాని కలిగించేవే. పైగా దానికి ఎంతో ఖర్చు కూడా అవుతుందని తెలిసిన విషయమే. కానీ పెటేస్ మాత్రం అందులో చాలావరకు ఖర్చు తగ్గించి ప్లాస్టిక్‌ను త్వరగా ధ్వంసం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

500 ఏళ్లకు పైగా భూమిపైన ఉండిపోయిన ప్లాస్టిక్‌ను ఫాస్ట్ పెటేస్ తన చేతితో చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి రీ సైక్లింగ్‌కు ఉపయోగపడేలా చేస్తుంది. అయితే దీనిని ఎన్నో విధాలుగా వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని ద్వారా రీ సైక్లింగ్ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్లాస్టిక్ లేని ఎకానమిని తయారు చేయవచ్చని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్‌ వేస్ట్‌ను రీసైకిల్ చేయడం ద్వారా మరెన్నో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసుకోవచ్చు

Follow this link for more updates:- Bigtv

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×