BigTV English

Punishments : వామ్మో.. ఒకప్పుడు మరణ శిక్ష పడితే ఇలా చంపేవారా..!

Punishments : భూలోకంలో పాపాలు చేస్తే.. చనిపోయాక నరకానికి వెళ్తారని పెద్దోళ్లు చెప్తుంటారు. అక్కడ మనల్ని మరిగే నూనెలో వేయిస్తారు. కాల్చూతారు.. నానా చిత్రహింసలు పెడతారు. నరకంలోనే కాదు.. భూమ్మీదే అంతకు మించిన క్రూరమైన శిక్షలు ఉన్నాయి తెలుసా..?

Punishments : వామ్మో.. ఒకప్పుడు మరణ శిక్ష పడితే ఇలా చంపేవారా..!

Punishments : భూలోకంలో పాపాలు చేస్తే.. చనిపోయాక నరకానికి వెళ్తారని పెద్దోళ్లు చెప్తుంటారు. అక్కడ మనల్ని మరిగే నూనెలో వేయిస్తారు. కాల్చూతారు.. నానా చిత్రహింసలు పెడతారు. నరకంలోనే కాదు.. భూమ్మీదే అంతకు మించిన క్రూరమైన శిక్షలు ఉన్నాయి తెలుసా..?


ఏనుగులు ఎంత బలంగా ఉంటాయో మన అందరికి తెలుసు. దక్షిణ మరియు ఆగ్నేయాసిలో దేశాల్లో మరణ శిక్ష పడితే ఏనుగులతో తొక్కించి చంపేస్తారు. తొక్కడం క్రూరంగా ఉండేలా ఏనుగులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు.

మనకు ఎవరి మీద అయినా కోపం వస్తే.. వాళ్లని బండకేసిబాదేయాలని అనిపిస్తుంది. కానీ ఇరాన్‌ దేశంలో ఇప్పటికీ ఇది అమలులో ఉంది. మరణ శిక్ష పడిన వ్యక్తిని ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి తోసేస్తారు.


క్వార్టర్ లేదా డ్రాయింగ్ అనేది చాలా క్రూరమైన శిక్ష. 13వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో మొదటిసారిగా ఈ శిక్షను అమలు చేశారు. దీని ప్రకారం.. మరణ శిక్షకు గురైన వ్యక్తిని గుర్రానికి కట్టేసి ఉరంతా లాగించి తల నరికేస్తారు. తరువాత శరీరాన్ని నాలుగు భాగాలుగా విభజించి గుర్రానికి కట్టి పరిగెత్తిస్తారు. ఈ శిక్ష దేశద్రోహానికి పాల్పడిన వారికి వేస్తారు.

ఆకలితో ఉన్న ఎలుకలను మరణ శిక్ష పడ్డ వ్యక్తి కడుపు లేదా ఛాతిపై బకెట్‌లో ఉంచుతారు. తర్వాత ఆ బకెట్‌ను వేడిచేస్తారు. అప్పుడు ఎలుకలు ఆ వ్యక్తిని కొరుక్కొని తింటాయి. 2 ఫాస్ట్ 2 ప్యూరియస్ లేదా గోమ్ ఆఫ్ థ్రోన్స్ చిత్రాలలో ఈ శిక్షలను ప్రదర్శించారు.

మనం జనరల్‌గా గ్రిల్స్‌పై చేపలు, చికెన్ వంటివి కాల్చుకుని తింటాం. వాటి ప్లేస్‌లో మనిషిని పెడితే.. ప్రజలు కాల్చడం కోసం ఒక ఇనుప గ్రిడ్‌లా ఉంటుంది. బాగా మండుతున్న ఆగ్ని,బొగ్గులపై ఆ గ్రిడ్‌ను పెడతారు. తర్వాత శిక్ష పడిన వ్యక్తి ఒంటికి ఆయిల్ పూసి గ్రిల్‌పై పెట్టి కాల్చుతారు.

శతాబ్దాల క్రితం తూర్పు ఆసియా నుంచి ఇంగ్లాండ్ వరకు.. మరణ శిక్ష పడిన వ్యక్తులను మరుగుతున్న నూనెలో వేయించేవారు. మొదట తలను తొలగిస్తారు. శరీరాన్ని మరుగుతున్న ద్రవం, నూనె లేదా తారుతో కూడిన వాటర్‌తో కుండలో ఉంచేవారు. ఆపై మరిగే వరకు వేడి చేసేవారు.

కీల్ హౌలింగ్ అనేది ఓ ప్రత్యేకమైన శిక్ష. 16వ శతాబ్దంలో డచ్‌లో ఇది అమలులో ఉండేది. నేరస్థులను తాడుతో ఓడ అడుగు భాగంలో కట్టేసేవారు. మరో ఓడతో ఆ నేరస్థుడు శరీరం రెండు ముక్కలు అయ్యేలా లాగేవారు.

లింగ్ చి అనేది 10వ శతాబ్దంలో చైనాలో అమలులో ఉన్న కఠినమైన శిక్ష. దీని ప్రకారం.. ఖండించిన వ్యక్తి శరీరం నుంచి చర్మం, అవయవాలను ఒక్కొక్కటిగా తొలగిస్తారు. గుండెను మాత్రం చివర్లో కట్ చేస్తారు. ఇలా శరీరాన్ని దాదాపు 1000 ముక్కలు చేస్తారు.

Tags

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×