BigTV English

Radio telescope : ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం

Radio telescope : ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం

Radio telescope : ది స్క్వేర్ కిలోమీటర్ అరే-ఎస్.కె.ఏ. అనేది ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్. దీని నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. అటు దక్షిణాఫ్రికాలోని కరూ ప్రాంతంలోనూ దీనికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. అయితే ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్ లో ఉంది. 2028 నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనేది టార్గెట్. ది స్క్వేర్ కిలోమీటర్ అరే ను 21వ శతాబ్దపు అతి పెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు సైంటిస్టులు. విశ్వంలో రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నా… ఇంకా అంతుచిక్కని వాటికి లెక్కేలేదు. అంటే ఇప్పటిదాకా తెలిసినవి కొన్నే. మిగతా వాటి గురించి తెలుసుకోడానికి ది స్క్వేర్ కిలోమీటర్ అరే ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఐన్ స్టీన్ సిద్ధాంతాలను పరీక్షించడంతో సహా భూమిని పోలిన గ్రహాల కోసం విశ్వంలో అన్వేషిస్తారు. ది స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది అతిపెద్ద ప్రాజెక్టు. దీనికోసం ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో అత్యధికంగా భూమిని కేటాయించారు. ఇందులో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు లక్షకుపైగా యాంటెన్నాలను నిర్మిస్తారు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీలను పోలివుంటాయి. అటు దక్షిణాఫ్రికాలో 197 భారీ డిష్ లను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఇది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్ అవుతుంది. ఇదో సుదీర్ఘమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. దీనికి సంబంధించిన ఆలోచన 1990లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్లు పట్టింది. కాన్సెప్ట్ , ఆలోచనలకు ఒక నిర్దష్ట రూపం ఇవ్వడానికి మొదటి పదేళ్లు పట్టింది. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్ మెంట్ కోసం మరో 10 ఏళ్లు పట్టింది. ఇక ప్రాజెక్టును వివరణాత్మకంగా డిజైన్ చేయడం, అవసరమైన భూమిని సేకరించడం, ప్రభుత్వాలను ఒప్పించడానికి… నిర్మాణం పూర్తి చేయడానికి మరో 10 ఏళ్లు గడిచిపోయాయి. మొత్తంగా ఈ అతిపెద్ద ప్రాజెక్టులో 16 దేశాలు భాగస్వాములవుతున్నాయి. వీటిలోకి ఎనిమిది దేశాలకు చెందిన సైంటిస్టులు ఈ టెలిస్కోప్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ తర్వాత తొలినాళ్లలో ఏర్పడిన పరిస్థితుల గురించి తెలుసుకోడానికి ఈ అతి భారీ టెలిస్కాప్ అవసరమని సైంటిస్టులు అంటున్నారు. దీని నిర్మాణాన్ని మరో ఆరేళ్లలో పూర్తిచేసి 2028నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. మరి దీని ద్వారా ఎలాంటి విశ్వరహస్యాలను ఛేదిస్తారో చూడాలి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×