Jubilee Hill Bypoll: ఎవరైనా ఎదురు తిరిగితే అణిచి వేసే మనస్తత్వం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దొంగ ఓట్లకు పాల్పడింది ఆ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అని, ఓటు చోరీ.. బీఆర్ఎస్-బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సదరు మంత్రి పొన్నం.
బీఆర్ఎస్-బీజేపీపై పొన్నం ఆగ్రహం
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్, ఎవరికీ డబల్ బెడ్ రూమ్ ఇచ్చారో అడగాలన్నారు. ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో ప్రశ్నించాలన్నారు. కనీసం సన్నబియ్యం కూడా ఇవ్వలేదన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగల్‌రావు నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.
బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏఐసీసీ జూబ్లీహిల్స్ ఇంచార్జి విశ్వనాధన్, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హాజరయ్యారు. కేసీఆర్ పాలనలో అందరి మీద కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ప్రతి బూత్‌లో ఉన్న ఓటర్లను కలిసి చెప్పాలని పార్టీ శ్రేణులకు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలుస్తున్నాడని, మీరంతా సపోర్ట్ గా ఉండాలని సూచన చేశారు. ప్రజా ప్రభుత్వం.. సంక్షేమం-అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలన్నారు. నవీన్ యాదవ్ గెలుపుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయలన్నారు కార్యకర్తలకు వివరించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. మీ కుటుంబంపై కవిత చేసిన కామెంట్స్‌కు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాగంటి సునీత అంటే తనకు సానుభూతి ఉందని, కానీ అందరిముందు మైక్ పట్టుకొని ఏడుస్తే విడ్డురంగా ఉందన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్, బీజేపీ అభ్యర్థి రేసులో విక్రమ్‌గౌడ్
జూబ్లీహిల్స్ బైపోల్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని సోమవారం సాయంత్రం మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిశారు. వాటిని సంబంధించిన వివరాలు అందజేశారు. వాటిని పరిశీలించిన అధికారులు, గతంలో ఉన్న ఓటర్ల జాబితాను యధాతథంగా ఉందని, ఎక్కడ కొత్త ఓటర్లను చేర్చలేదని వివరణ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎత్తులు చిత్తయ్యాయి.
కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ: మంత్రి పొన్నం
ఓటు చోరీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా
ఎవరు ఎదురుతిరిగినా అణిచివేసే మనస్తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీనే దొంగ ఓట్లకు పాల్పడింది
– మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/0F5v8DVCoh
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025