BigTV English

Business:24 గంటలు.. రూ.1400 కోట్ల బిజినెస్..

Business:24 గంటలు.. రూ.1400 కోట్ల బిజినెస్..

Business:విడుదలకు ముందే శాంసంగ్ S23 ప్రీమియం స్మార్ట్ ఫోన్ కోసం యూజర్లు ఎగబడ్డారు. 24 గంటల్లో ఏకంగా లక్షా 40 వేల యూనిట్లకు ఆర్డర్ పెట్టేశారు. ప్రీ బుకింగ్సే ఇన్ని వచ్చాయంటే… S23 ప్రీమియం స్మార్ట్ ఫోన్‌పై యూజర్లలో ఏ రేంజ్ మోజు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కరోజులో యూజర్లు బుక్ చేసిన S23 స్మార్ట్ ఫోన్ల విలువ రూ.1400 కోట్లు అని శాంసంగ్ తెలిపింది.


ఫిబ్రవరి 1న గెలాక్సీ S23 సిరీస్‌లోని ‘గెలాక్సీ S23, గెలాక్సీ S23 ప్లస్‌, గెలాక్సీ S23 అల్ట్రా’ వేరియంట్లను శాంసంగ్‌ లాంచ్ చేసింది. ఫిబ్రవరి 23 వరకు ప్రీ బుకింగ్‌ చేసుకోడానికి అవకాశం ఇచ్చింది. ఒక్కరోజుకే లక్ష 40 వేల యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయంటే… గడువులోగా ఇంకెన్ని ఆర్డర్లు వస్తాయోనని అంటున్నారు… ఆ కంపెనీ ప్రతినిధులు.

గతంలో శాంసంగ్‌ విడుదల చేసిన గెలాక్సీ S22 వేరియంట్ల కంటే… S23 ధర రెండు రెట్లు పెరిగింది. ఒక్కో ఫోన్ రేటు సగటున లక్ష రూపాయలు ఉన్నా… లక్షా 40 వేల యూనిట్లకు ప్రీ బుకింగ్స్ రావడం విశేషమని శాంసంగ్ అంటోంది. S23 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.75 వేలు కాగా… అత్యధికంగా రూ.1.55 లక్షల వరకు ఉంది. ఈ ఫోన్లను నోయిడా ప్లాంట్‌లో తయారు చేస్తోంది… శాంసంగ్. గెలాక్సీ S సిరీస్‌ ఫోన్లను మాత్రం వియాత్నంలోని మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో తయారు చేసి, భారత్‌కు ఎగుమతి చేసింది.


ఇవే కాదు… గతంలో శాంసంగ్ బడ్జెట్ ధరలో విడుదల చేసిన F సిరీస్ స్మార్ట్ ఫోన్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. F62, F23, F13 పేరుతో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లకు… భారత్‌లో విపరీతంగా ఆదరణ లభించింది. ముఖ్యంగా గత దసరా-దీపావళి సీజన్లో ఆ ఫోన్లు భారీ డిస్కౌంట్ ధరకు రావడంతో… చాలామంది వాటిని కొన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×