Big Stories

Saving Plans : 15 శాతం రాబడి ఎలా? 8 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ పోతే మినిమం 10 శాతం రిటర్న్స్ వస్తాయా?

Saving Planes

Saving Planes : స్టాక్ మార్కెట్లలో ఓపిగ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 10, 15 శాతం కాదు.. ఒక్కోసారి కొందరికి 100 శాతం, 200 శాతం రిటర్న్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే, అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్నిసార్లు 40 శాతం, 60 శాతం రిటర్న్స్ ఇచ్చినవీ ఉన్నాయి. కాకపోతే, రిస్క్ ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్ పై సూచనలు, సలహాలు ఇచ్చే వాళ్లు 12 శాతం నుంచి 15 శాతం వరకు వస్తాయని చెబుతుంటారు. అవన్నీ రిస్క్ తీసుకోకుండా సేఫ్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ల కోసం. కాని, మీరు గనక రిస్క్ తీసుకోడానికి ఇష్టపడితే.. చూస్కుందాం ఏదైతే అదైంది అని అనుకుంటే.. ఒక్కోసారి లాభాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. కాని, ఇది కూడా అందరికీ అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. మనం పెడుతున్నది స్టాక్ మార్కెట్లో. ఎప్పుడు భారీ లాభాలు ఇస్తాయో, ఎప్పుడు కుప్పకూలుతాయో చెప్పలేం. సో, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

- Advertisement -

రిస్క్ ఉన్నా ఫర్వాలేదు.. రిటర్న్స్ బాగా రావాలి అనుకున్న వాళ్లు  మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి రిటర్న్స్ ఇస్తే కళ్లు చెదిరే రీతిలో ఉంటాయి. పోయినా అలాగే కళ్లు తిరుగుతాయి. అందుకే ఇన్వెస్ట్‌మెంట్‌లో 30 శాతం మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో, 70 శాతం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టమంటుంటారు. ఇలా నెలకు రూ.20 వేల చొప్పున 12 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే… 13 శాతం రాబడి అంచనాతో రూ.62 లక్షల వరకు ఆర్జించవచ్చు.

- Advertisement -

పెట్టుబడి సేఫ్‌గా ఉండాలనుకునే వాళ్లు.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ఏడాదికి 10 శాతం చొప్పున మీ ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటూ వెళ్తే.. మంచి రిటర్న్స్ వస్తాయి.
నెలకు రూ.6వేల చొప్పున, ఏడాదికి 10 శాతం పెంచుకుంటూ వెళ్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.12లక్షల వరకు ఆర్జించవచ్చు. సో, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ట్రై చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందుకు బాగా ఎంక్వైరీ చేయడం బెటర్. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News