BigTV English
Advertisement

Children’s Education : పిల్లల చదువు కోసం సేవింగ్స్.. ట్రై చేసి చూడండి

Children’s Education : పిల్లల చదువు కోసం సేవింగ్స్.. ట్రై చేసి చూడండి
Children's Education

Children’s Education : ఎప్పుడైనా సరే.. పిల్లల పేరు మీద ఏదైనా సేవింగ్స్ చేద్దామనుకుంటే.. ముందుగా తల్లిదండ్రులు.. టర్మ్ పాలసీ తీసుకోవాలి. మీరు ఎంత సేవింగ్ ప్లాన్స్ చేస్తున్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే.. ముందు పాలసీ తీసుకోవాలి. ఉన్నట్టుండి అనుకోనిది జరిగితే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడకూడదు. ముందు పాలసీ తీసుకుని.. ఆ తరువాత పిల్లల చదువులు, పెళ్లిళ్ల గురించి ఆలోచించాలి.


పిల్లల కోసం చైల్డ్ ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఉన్నాయి. కొన్ని రెండుసార్లు పరిహారం అందిస్తారు. ఉదాహరణకు ఈ పాలసీ కడుతున్న వ్యక్తికి ఏదైనా జరిగితే.. ముందుగా నామినీకి పరిహారం చెల్లిస్తారు. అక్కడితో ఆ పాలసీ ముగియదు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ పాలసీ ప్రీమియంను సదరు కంపెనీయే చెల్లించుకుంటూ.. గడువు ముగిసిన తరువాత పిల్లలకు పరిహారం అందిస్తుంది. గడువు ముగియడం అంటే.. దాదాపుగా పిల్లలు పెద్దవాళ్లు అవుతారు కాబట్టి.. చేతికి ఇస్తారు. సో, చదువు, పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదు. మార్కెట్లో ఇలాంటి పాలసీలు కనుక్కుని మరీ ఇన్వెస్ట్ చేయడం మంచిది.

ఇక పిల్లల కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బంగారం కొనొచ్చు. స్థలాలు లేదా ఇళ్లు కొనిపెట్టొచ్చ. పీపీఎఫ్ లాంటి సెక్యూరిటీ ఉండే ఫండ్స్‌లో, లాంగ్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఎండోమెంట్‌ ప్లాన్‌, యూనిట్‌ లింక్డ్ పాలసీలు కూడా ఉన్నాయి. రిస్క్ తక్కువ తీసుకోవాలనుకునే వారు ఎండోమెంట్‌ పాలసీలు ట్రై చేయొచ్చు. వీటిలో రాబడి 5-6 శాతం వరకు ఉంటుంది. మరో పదేళ్ల తర్వాతే పిల్లలకు డబ్బు అవసరం ఉంటుందని భావించినప్పుడు యులిప్‌లలో ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. యులిప్‌ తీసుకుంటే.. గడువు తీరిన తర్వాత ఫండ్‌ విలువను చెల్లిస్తాయి. మధ్యలోనే పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. పరిహారం కూడా చెల్లిస్తాయి. కాకపోతే పాలసీని ఎంచుకునేటప్పుడు కచ్చితంగా వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం ఉండేలా చూసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వారు.. వారు చిన్నగా ఉన్నప్పుడే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. టెన్త్ క్లాస్ అయిపోయే సమయానికో, ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లో జాయిన్ అయ్యే సమయానికో లేదంటే పెళ్లి సమయానికో.. పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేలా ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోగలిగినప్పుడు ఊహించని లాభాలు వస్తాయి. మరి పిల్లల భవిష్యత్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి. నెలనెలా వచ్చే జీతం లేదా ఆదాయం నుంచి కనీసం 15-20 శాతం పక్కనపెట్టి.. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. 


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×