BigTV English

BJP : కొత్త సచివాలయానికి కేసీఆర్ రోజూ వస్తారా..? బీజేపీ నేతల ప్రశ్నలు..

BJP : కొత్త సచివాలయానికి కేసీఆర్ రోజూ వస్తారా..? బీజేపీ నేతల ప్రశ్నలు..

BJP : తెలంగాణ కొత్త సచివాలయాన్ని కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణానికి సచివాలయ నిర్మాణమే సరైన సాక్ష్యమని స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు.


తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. తెలంగాణలో మరో 5 నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

నూతన సచివాలయం ప్రారంభోత్సవంపై మరో బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. కొత్త సచివాలయాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ ఈ 3, 4 నెలలపాటు రోజు ఆఫీస్‌కు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు. 9 ఏళ్లుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని మండిపడ్డారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుండాలని ఆశిస్తున్నానని అన్నారు. గత 9 ఏళ్లల్లో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇకనైనా వచ్చి, ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నాడు గొప్పగా సచివాలయం ఉండేదని.. ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని ఈటల విమర్శించారు. బీజేపీ నేతల విమర్శలకు కేసీఆర్ చెక్ పెడతారా..? ఇకనైనా సచివాలయానికి రెగ్యులర్ గా వస్తారా..?


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×