BigTV English

Glaucoma:అంతుచిక్కని వ్యాధుల్లో ఒకటి.. గ్లాకోమా..

Glaucoma:అంతుచిక్కని వ్యాధుల్లో ఒకటి.. గ్లాకోమా..

Glaucoma:అనుకోకుండా వచ్చి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసే వ్యాధులు ఎన్నో మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ అలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటికి పూర్తిస్థాయిలో చికిత్స ఎలా సాధ్యం, అసలు ఆ వ్యాధి రాకుండా నివారణ ఏంటి అనే విషయాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వ్యాధుల్లో ఒకటే గ్లాకోమా. ఈ వ్యాధికి సంబంధించిన లుథియానా శాస్త్రవేత్తలు పరిశోధనలను వేగవంతం చేశారు.


ఇంట్రాక్రానియల్ ప్రెజర్ అనేది గ్లాకోమా ఉన్న పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తుందని, దాదాపు 50 శాతం వరకు గ్లాకోమా రకాలు ఈ లక్షణం ఉందని లుథియానా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇంట్రాక్రానియల్ ప్రెజర్ అనేది మనుషుల కంటిచూపుకు సంబంధించిందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ముక్కు వైపు కంటిచూపు మందగించడం అనేది దీనికి ముఖ్య లక్షమని తెలిపారు. 60 ఏళ్ల పైబడిన వారికి గ్లాకోమా సోకి కంటిచూపు కోల్పోవడం అనేది ఎక్కువశాతం జరుగుతూ వస్తోంది.

ఆప్టిక్ నెర్వ్ డీజెనరేషన్ అనేది గ్లాకోమాకు ముఖ్య కారణమని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఈ వ్యాధి ఉన్న పేషెంట్లలో ముఖ్యంగా కనిపించే మరో లక్షణం ఇంట్రాక్యులర్ ప్రెజర్ (ఐఓపీ) అంటే ఐ ప్రెజర్. ఐఓపీ శాతం సాధారణంగా ఉన్నవారికి గ్లాకోమా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఒక్కొక్కసారి ఐఓపీ నార్మల్‌గా ఉన్నవారికి కూడా గ్లాకోమా సోకుతుందని.. కానీ అది చాలా అరుదుగా జరుగుతుందని వారు తెలిపారు.


గ్లాకోమా అనేది సోకిన తర్వాత దానికి పూర్తిగా చికిత్స అనేది ఉండదు. అయితే ఐ ప్రెజర్ అనేది గ్లాకోమాకు దారితీయక ముందే దానిని అదుపుచేయడానికే వైద్యులు ప్రయత్నిస్తారు. ఐఓపీ ఎక్కువ ఉన్నవారికి గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ముందు నుండే ఎలర్ట్ చేస్తారు. కానీ మామూలు ఐఓపీ ఉన్నవారిలో గ్లాకోమా వస్తుందో లేదో తెలియదు కాబట్టి అలాంటి వారికి చికిత్స చేయడం కష్టంగా ఉంటుందని వైద్యులు బయటపెట్టారు.

గ్లాకోమా వ్యాధి సోకడానికి కేవలం కంటిపై పడే ప్రెజర్ మాత్రమే కాకుండా స్కల్‌పై పడే ప్రెజర్ కూడా అప్పుడప్పుడు కారణమవుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలిందన్నారు. మామూలుగా ఆప్టిక్ నర్వ్ అనేది మెదుడు చుట్టూనే ఉంటుంది. అందుకే మెదడుకు సంబంధించిన ఇంట్రాక్రానియల్ ప్రెజర్ కూడా గ్లాకోమాకు దారితీయవచ్చని ముందే పేర్కొన్నారు. 80 గ్లాకోమా పేషెంట్లపై వారి పరిశోధనలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు లుథియానా శాస్త్రవేత్తలు.

Russia Ukraine war:ఇండియాకు లాభం తెచ్చిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ వార్..

New Radar System:రేడియో ఆస్ట్రానమీలో కొత్త పరికరం.. తక్కువ ఖర్చుతో..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×