E-Paper
Advertisement

Moon:- చంద్రుడిపై నీటిజాడ.. పూసల ఆకారంలో..

Moon:- చంద్రుడిపై నీటిజాడ.. పూసల ఆకారంలో..
Advertisement

Moon:- ఎక్కువశాతం శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి, దానిపైకి శాటిలైట్లను, మనుషులను పంపించడానికి ఇష్టపడతారు. చంద్రుడిపై చేసిన పరిశోధనలకు ఎక్కువ సక్సెస్ రేటు ఉండడం కూడా దీనికి ఒక కారణం. అలా ఎన్నో దేశాలు చేసిన కొన్ని వేల పరిశోధనల్లో చంద్రుడి గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. తాజాగా మరో విషయం శాస్త్రవేత్తలకు ఆసక్తిని పెంచింది. అదే చంద్రుడిపై నీటిజాడ.

ఏ గ్రహంలో అయినా మనిషి జీవనం కొనసాగాలంటే అక్కడ నీరు ఉండాలి. అందుకే ఈ కోణంలో ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రుడిపై కూడా నీటిజాడ కనిపించడం శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచేస్తోంది. చంద్రుడిపై అక్కడక్కడ పూసలలాగా నీరును వారు కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే చంద్రుడిపై రిజర్వాయర్ ఏర్పాటు చేయడం సులభమే అని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది భవిష్యత్తులో ల్యూనార్ నేలపై ఎన్నో పరిశోధనలకు ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

Advertisement

చంద్రుడిపై నేల అనేది ఎప్పుడూ ఎండిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా చంద్రుడిపై నీటిజాడ ఉందని తెలిసేలా పలు పరిశోధనలు జరిగాయి. 2020లో చైనా చేసిన రోబోటిక్ చేంజ్ ఈ5 మిషిన్ సమయంలో ట్యూనార్ నేలపై నుండి కొంత మట్టిని శాస్త్రవేత్తలు సేకరించారు. అప్పటినుండి ఈ మట్టిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చంద్రుడి నేలపై సోలార్ విండ్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

చంద్రుడి చుట్టూ ఎప్పుడో ఒక సోలార్ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అవన్నీ దానిపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ నేలపై పూసలులాగా నీళ్లు ఫార్మ్ అవ్వడానికి కూడా ఇలాంటి ఒక ఈవెంట్ కారణమయ్యి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనల సంఖ్య ఎక్కువయ్యింది. భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే అక్కడ నీరు అనేది ఉంటే.. తాగడానికి మాత్రమే కాకుండా ఫ్యూయల్‌గా కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మూడ్‌ను మెరుగుపరిచే ఐఫోన్ 14 ప్లస్..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×