BigTV English

BellamKonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌

BellamKonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌
BellamKonda Srinivas

BellamKonda Srinivas : యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. అది కూడా సినిమాల ప‌రంగా కావ‌టం ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. తెలుగు సినిమా చ‌రిత్రలో కాదు.. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లోనే బెల్లంకొండ మూవీ రికార్డ్ క్రియేట్ చేయటం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. జ‌య‌జాన‌కినాయక‌. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌ను ఖూన్‌కార్ పేరుతో యూ ట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ మూవీ యూ ట్యూబ్‌లో వ్యూస్ ప‌రంగా ఇప్ప‌టి వ‌ర‌కు 709 మిలియ‌న్స్ వ్యూస్‌ను సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే హీరో సినిమాకు ఈ రికార్డ్ లేదు.


జ‌య‌జానకి నాయ‌క సినిమా సాధించిన వ‌ర‌ల్డ్ రికార్డ్ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2017లో విడుద‌లైంది. ఆరేళ్ల త‌ర్వాత ఈ రికార్డ్ క్రియేట్ చేయ‌టం అనేది నిజంగా అభినందించాల్సిన విష‌య‌మే. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌గా, శ‌ర‌త్ కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు, నందు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థియేట‌ర్స్‌లో ఓ మోస్త‌రుగానే రాణించిన ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌కు ఇలాంటి రికార్డ్ ద‌క్కటం కొస మెరుపు.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల హిందీ వెర్ష‌న్స్‌కు ఫ్యాన్ బేస్ ఉంది. యూ ట్యూబ్‌లో ఈ యంగ్ హీరో సినిమాల‌కు మిలియ‌న్స్ సంఖ్య‌లో వ్యూస్ వ‌స్తుంటుంది. అందుక‌నే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఛ‌త్ర‌ప‌తిని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం మే 12న రిలీజ్ అవుతుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×