E-Paper
Advertisement

Parineeti Chopra : ఆ ఎంపీతో డేటింగ్..? పరిణీతి చోప్రా ప్రేమలో పడిందా..?

Parineeti Chopra : ఆ ఎంపీతో డేటింగ్..? పరిణీతి చోప్రా ప్రేమలో పడిందా..?
Advertisement

Parineeti Chopra : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాపై కొన్నిరోజులుగా ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ భామ ఓ ఎంపీతో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఆ ఎంపీ ఎవరో కాదు.. ఆప్ నేత రాఘవ్ చద్దా. పంజాబ్‌ నుంచి ఆప్ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో కలిసి పరిణీతి పార్టీకి వెళ్లిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ జంట ప్రేమలో ఉన్నారని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్ కు ఆప్ మరో ఎంపీ సంజీవ్ ఆరోరా చేసిన ట్వీట్ బలాన్ని చేకూర్చింది.

ఆ ట్వీట్ లో ఏముందంటే..?
‘పరిణీతి, రాఘవ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి బంధం.. ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి’’అని సంజీవ్ ఆరోరా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు ఎంగేజ్ మెంట్ జరిగిందని సోషల్‌మీడియాలో ఒకటే చర్చ.

Advertisement

ఎంపీ రాఘవ్‌ చద్దాతో డేటింగ్‌ చేస్తోందని వస్తున్న వార్తలపై పరిణీతి స్పందించింది. తాజాగా ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించగానే ఆమెను గుచ్చిగుచ్చి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పరిణీతి మాత్రం సిగ్గుపడుతూ వెళ్లిపోయింది. నవ్వుతూ బాయ్‌, గుడ్‌ నైట్‌ అంటూ వెళ్లిపోయింది. పరిణితి సిగ్గుపడుతూ సమాధానం దాటవేయడంతో రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు నిజమేనని స్పష్టమవుతోంది.

అటు రాఘవ్ చద్దా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ జంటలో ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తేగానీ వారి బంధంపై పూర్తి క్లారిటీ రాదు. పరిణీతి ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కి జోడీగా ‘క్యాప్సూల్‌ గిల్‌’ అనే మూవీలో నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×