BigTV English

Water Purifier:తక్కువ ఖర్చుతో తాగునీటితో పాటు కరెంటు..

Water Purifier:తక్కువ ఖర్చుతో తాగునీటితో పాటు కరెంటు..

Water Purifier:ఈరోజుల్లో ప్రకృతిలోని ప్రతీది కాలుష్యానికి గురవుతుంది. ఏది మనిషి ఆరోగ్యానికి పూర్తిగా మేలు చేసే విధంగా లేదు. పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు అన్ని కలుషితమయిపోయాయని చాలామందికి తెలిసిన విషయమే. అందుకే కాలుష్యానికి చెక్ పెట్టాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఆ ప్రయత్నాలు జరుగుతుండగానే.. మరోవైపు కాలుష్యానికి గురైన వనరులను మనుషులు ఉపయోగించే విధంగా మార్చడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు.


ఇప్పటికే కలుషితం అయిపోయిన నీటిని, దాంతో పాటు వర్షపు నీటిని తాగునీటిగా మార్చడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారు. అవి సక్సెస్ అయ్యాయి కూడా. కానీ అలా చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతే కాకుండా వీటికి కరెంటు కూడా చాలా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇబ్బందులను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే వారు ఒక కొత్త ప్రక్రియను కనిపెట్టారు.

వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతున్న క్రమంలోనే కరెంటు కూడా జెనరేట్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. అందుకే ఆ దిశగా వారు పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ ప్రక్రియలోనే వారొక మల్టీఫంక్షనల్ మెంబ్రేన్‌ను తయారు చేశారు. ఇది వేస్ట్ వాటర్‌ను తాగునీటిగా మారుస్తుంది దాంతో పాటు కరెంటును కూడా జెనరేట్ చేస్తుంది. ఈ పరిశోధన సక్సెస్ అయినట్టుగా స్వయంగా కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు.


ఈ మెంబ్రేన్ ద్వారా ఎలాంటి వేస్ట్ వాటర్ అయినా.. తాగునీటిగా ప్యూరిఫై అవ్వడంతో పాటు కరెంటు కూడా జెనరేట్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మెంబ్రేన్ చూడడానికి శాండ్విచ్ లాగా ఉంటుంది. ఇది కింద ఉన్న పాలిమర్‌తో నీటిన ప్యూరిఫై చేస్తూ.. పైభాగంలో కరెంటును జెనరేట్ చేస్తుంది. ఇది నీటిని 95 శాతం వరకు ప్యూరిఫై చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మెంబ్రేన్ పూర్తిగా మార్కెట్లోకి వస్తే తాగునీటి సమస్య చాలావరకు తక్కువ ఖర్చుతో దూరమవుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Human Body:మనిషి శరీరంలోకి వెళ్లగలిగే రోబో..

PCR Test:ర్యాపిక్ టెస్ట్‌కంటే వేగంగా పీసీఆర్ రిజల్ట్..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×