BigTV English

Pig Gall Bladder: పిగ్ గాల్ బ్లాడర్‌తో గాయాలకు మందు.. ఇండియాలోనే మొదటిసారి..

Pig Gall Bladder: పిగ్ గాల్ బ్లాడర్‌తో గాయాలకు మందు.. ఇండియాలోనే మొదటిసారి..
Pig leaning over the railing of his cot

Pig Gall Bladder : పెరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది హెల్త్ రంగంలో ఎన్నో మార్పులకు కారణమవుతోంది. ఈ మార్పులను మానవాళి మెరుగైన చికిత్సను అందించే దిశగానే అడుగువేస్తున్నాయి. అయినా కూడా శాస్త్రవేత్తలు తృప్తిపడకుండా మరింత మెరుగ్గా మనుషులకు చికిత్స అందించాలని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా పిగ్ గాల్ బ్లాడర్‌తో శరీరానికి అయిన గాయాలను నయం చేయడానికి ఉపయోగపడే యంత్రాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఇండియాలో ఇలాంటి మొదటిసారని వారు చెప్తున్నారు.


శరీరానికి అయ్యే గాయాలకు నయం చేయడం కోసం, వాటిని నొప్పి తెలియకుండా తగ్గించడం కోసం ఇప్పటికే పలు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా పిగ్ గాల్ బ్లాడర్‌లోని ఒక టిష్యూతో ఒక బయోమెడికల్ పరికరాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా కాలిన గాయాలకు ఇది ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి పరికరం లేదని, కాలిన గాయాలను, వాటి వల్ల అయిన మరకలను నయం చేయడం కోసం ఈ డివైజ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ జెనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనిని అప్రూవ్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు శరీరానికి అయ్యే గాయాల కోసం మెరుగైన ప్రొడక్ట్ అనేది మనుషులకు అందుబాటులో లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉన్న ప్రొడక్ట్స్‌లో చాలావరకు మంచి క్వాలిటీ కాదన్నారు. అయితే ఈ బయోమెడికల్ డివైజ్‌ కోసం ఉపయోగించిన ప్రక్రియ మెడికల్ రంగంలో కొత్తేమీ కాదని వారు బయటపెట్టారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రొడక్ట్ తయారీ కోసం ఎన్నో విధాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా వారి ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇండియన్ మెడికల్ రూల్స్ ప్రకారం జంతువుల నుండి తయారు చేసే మెడికల్ పరికరాలు అనేవి ప్రాక్టికల్‌గా వర్కవుట్ చేయకూడదు అని అంటుంటారు. కానీ ఈ డివైజ్ తయారీ ఒక మైల్‌స్టోన్‌లాగా మిగిలిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


ఈ బయోమెడికల్ పరికరం ద్వారా ఇండియాలో గాయాల చికిత్సకు అయ్యే ఖర్చు 10 వేల నుండి 2 వేలకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి ఒక పరికరం తయారు కావడం ఇదే మొదటిసారి కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ల నుండి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ పరికరం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇలాంటి ఒక పరికరం సక్సెస్ అవ్వడాన్ని చూసి ఎన్నో ఇంటర్నేషనల్ మెడికల్ మార్కెట్లు కూడా ఇలాంటిది తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×