BigTV English

New Topcoat:ప్లాస్టిక్ అవసరం లేని కోటింగ్.. ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్..

New Topcoat:ప్లాస్టిక్ అవసరం లేని కోటింగ్.. ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్..

New Topcoat: ప్లాస్టిక్ అనేది మానవాళికి మంచి చేయదు అని తెలిసినా కూడా దాని మనుషుల జీవితాల్లో నుండి పూర్తిగా తొలగించడం వీలు కావడం లేదు. అందుకే కనీసం దానికి ప్రత్యామ్నాయాలు కనిపెడితే.. ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయినా కూడా కొన్ని రంగాల్లో ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టడం కష్టంగా మారుతుంది. అందులో ఒకటి ఫ్యాషన్ ఇండస్ట్రీ. తాజాగా ఇందులో కూడా ఉపయోపగడే ఒక అద్భుతమైన టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు చెప్తున్నారు.


ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొన్ని బట్టలకు ప్లాస్టిక్ కోటింగ్ అనేది తప్పదు. అలాంటి ప్లాస్టిక్ కోటింగ్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అన్న విషయం కూడా పెద్ద సీక్రెట్ ఏమీ కాదు. అయితే ప్లాస్టిక్ కాకపోయినా లెథర్ కోటింగ్‌తో కొన్ని బట్టలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కాకుండా మొక్కలతో బట్టలకు కోటింగ్ చేయవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 100 శాతం ప్లాస్టిక్ ఫ్రీగా టాప్‌కోట్‌ను తయారు చేయవచ్చని వారు సాధించి చూపించారే. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించగల విషయమని చెప్తున్నారు.

కార్న్, షుగర్, కాస్టర్ ఆయిల్, ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్.. ఇలాంటివి ఉపయోగించి లిక్విడ్‌ప్లాంట్ అనే పేరుతో శాస్త్రవేత్తలు ఒక డెవలప్‌మెంట్ చేశారు. ఇది ప్రపంచంలో మొక్కల సాయంతో తయారైన మొదటి టాప్‌కోట్. ఇప్పటికే జంతువుల లెథర్‌ను టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో విచ్చలవిడిగా ఉపయోగిస్తుండగా.. దానికి ప్రత్యామ్నాయంగా వేగర్ లెథర్ అనేది అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ప్లాస్టిక్ టాప్‌కోట్‌కు ప్రత్యామ్నాయంగా మొక్కలతో తయారు చేసిన టాప్‌కోట్ అందుబాటులోకి రానుంది.


కొత్త రకం టాప్‌కోట్‌ను తయారు చేసిన ఈ సంస్థ.. త్వరలోనే మరెన్నో పర్యావరణానికి హాని కలిగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలను కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నింటికి మొక్కలతో ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడమే తన లక్ష్యమని చెప్తోంది. ప్రస్తుతం తమ సొంత ఫ్యాషన్ సంస్థలకు, మరికొన్ని ఇతర సంస్థలకు తప్పా లిక్విడ్‌ప్లాంట్ టాప్‌కోట్ అనేది బయట మార్కెట్లో అందుబాటులో లేదు. త్వరలోనే దీనిని పూర్తిగా కమర్షియల్ ప్రొడక్ట్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేలా చేస్తామని సంస్థ చెప్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×