BigTV English

Naveen: నవీన్ హత్య కేసులో లవర్ అరెస్ట్.. అంతా ఆమె వళ్లే..!?

Naveen: నవీన్ హత్య కేసులో లవర్ అరెస్ట్.. అంతా ఆమె వళ్లే..!?

Naveen: నవీన్ హత్య ఎంత సంచలనం రేపిందో.. పోలీస్ దర్యాప్తులో అంతకుమించి బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. తన ప్రేమకు పోటీగా వస్తున్నాడనే కోపంతో.. నవీన్‌ను దారుణంగా చంపేశారు హరహరకృష్ణ. పార్టీకని పిలిచి.. మందు తాగించి.. ఊరంతా తిప్పి.. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. గొంతు నులిమి చంపేశాడు. కత్తితో చాతిని చీల్చి గుండెను బయటకు తీశాడు. చేతివేళ్లు కట్ చేశాడు. కడుపులో పొడిచి పేగులు లాగేశాడు. అత్యంత క్రూరంగా, పాశవికంగా నవీన్‌ను హత్య చేశాడు హరహరకష్ణ.


హత్య చేశాక కూడా అంతే ఉన్మాదంగా ప్రవర్తించాడు హరి. నవీన్ శరీర భాగాలను బ్యాగులో వేరే చోటికి తీసుకెళ్లి పడేసి వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగొచ్చి వాటిని కాల్చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి నేరుగా స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. క్రైమ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి ఇలా చేశాడని పోలీస్ విచారణలో తెలిపాడు.

అయితే, పోలీసులకు మొదటినుంచీ ఓ అనుమానం ఉండేది. ఇదంతా నవీక్ ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా సహకరించారా? అని. ఇదే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తే.. మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లవర్ నిహారిక కోసమే తానీ హత్య చేశానని చెబుతూనే.. తనకెవరూ హెల్ప్ చేయలేదు కానీ.. అంటూ అసలు జరిగిందేంటో చెప్పాడు నిందితుడు.


నవీన్‌ను చంపేశాక.. అతని శరీర భాగాలను ఫోటో తీసి.. ప్రియురాలు నిహారికకు వాట్సాప్ చేశాడు. హసన్ ఇంట్లో స్నానం చేసి.. డ్రెస్ మార్చుకుని.. పరారయ్యాడు నిందితుడు. ఆ తర్వాత తిరిగొచ్చి.. లవర్‌ నిహారికను కలిశాడు. ఫ్రెండ్ హసన్, ప్రియురాలు నిహారికను తీసుకెళ్లి మర్డర్ స్పాట్ చూపించాడు. ఓ హోటల్‌లో హరహర, నిహారికలు భోజనం చేశారు. హరహరకృష్ణకు ఖర్చుల కోసం రూ.1500 ఇచ్చింది నిహారిక.

ఇక, హరి పంపిన వాట్సాప్ ఫోటోలను డిలీట్ చేసిన నిహారిక.. తనకేం తెలీనట్టు నటించింది. నవీన్ ఫ్రెండ్స్ కొందరు ఆమెకు ఫోన్ చేసి అతని కోసం ఆరా తీయగా.. తనకేం తెలీదన్నట్టు ఆన్సర్ చేసింది. పోలీసులు ప్రశ్నిస్తే కూడా.. ఏమాత్రం భయం, బెదురు లేకుండా.. తానకేం తెలీదంటూ ధీమాగా సమాధానం చెప్పింది. నిహారికకి కౌన్సిలింగ్ ఇప్పించినా.. ఆమె విచారణకు అసలే మాత్రం సహకరించలేదు. అందుకే, ఆమెను కాకుండా నిందితుడినే గట్టిగా పోలీస్ స్టైల్‌లో ప్రశ్నిస్తే.. అసలు విషయం మొత్తం చెప్పేశాడు. హరహరకృష్ణ స్టేట్‌మెంట్ మేరకు అతని ఫ్రెండ్ హసన్‌ను ఏ2 గా, ప్రియురాలు నిహారికని ఏ3 గా కేసు నమోదు చేశారు. హత్యకు వారిద్దరూ సహకరించారని, ఫోన్ డేటా డిలీట్ చేసి.. ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. నిహారిక, హసన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×