Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ‘హరి హర వీర మల్లు’. చాలా రోజుల నుంచి ఆగిన ఈ సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. ఈ షెడ్యూల్‌తో పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అందు కోసం కొన్ని రోజుల ముందు ఆయన ఈ సినిమా కోసం వర్క్ షాప్‌లోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. మొగల్ కాలానికి చెందిన బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కుతోంది.
‘హరి హర వీర మల్లు’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న సినిమా కావటంతో బాలీవుడ్ నటీనటులను మేకర్స్ ఇందులో నటింప చేస్తున్నారు. ఇద్దరి హీరోయిన్స్‌లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది. అలాగే ఇందులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర కూడా కనిపించనుంది. ఆ పాత్రలో ముందు మేకర్స్ బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్‌ను నటింప చేయాలని అనుకున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే సినిమా మేకింగ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో అర్జున్ రాంపాల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో ఇప్పుడు నిర్మాతలు మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ను నటింప చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ‘హరి హర వీర మల్లు’ సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.