
English Year: తెలుగు వాళ్లకి ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రపంచంలో క్రిస్టియానిటి ఎక్కువ ఉండే దేశాల్లో జనవరి1 కొత్త సంవత్సరంగా భావిస్తుంటారు. ఏ మతం వారికి నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైనప్పటికీ జనవరి ఒకటి కామన్ గా మారిపోయింది. జనవరి 1 న్యూ ఇయర్ గా ఆహ్వానించి కొంతమంది సంప్రదాయం ప్రకారం కూడా ఆచారాన్ని కొనసాగిస్తుంటారు. జనవరి 1ని నూతన సంవత్సరంగా భావించే వారు కొత్త సంత్సరాన్ని ఎలా ఇన్వయిట్ చేయాలో తెలుసుకోవాలి. జీరో అవర్ లో పబ్ లోనే మరో చోట న్యూ ఇయర్ ను ఆహ్వానించం కాకూండా ఇంట్లో చేసుకోవడం శుభకరం.
ఇంటి సభ్యులంతా ఒక చోట కలిసి ఉండాలి . ఒకటో తారీఖు ఉదయం దీపారాధన, పూజలు చేసుకోవాలి. సూర్యోదయానికి కంటే ముందు ఇంట్లో అగ్నిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే గ్యాస్ స్టవ్ పై కాకుండా కర్రలపై పొయ్యి వెలిగించి పాలు పొంగించడం లాంటిది చేయాలి. ఆగ్నేయం మూల అగ్నిదేవుడు ప్రతిష్టించి ఉంటాడు. ఆగ్నేయ మూలలో అగ్నిని వెలిగించడం వల్ల అగ్నిదేవుడు ప్రసనమై అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఆగ్నేయ మూలలో అగ్ని దేవుడ్ని ప్రసనం చేసుకోవడం వల్ల కలహాలు వంటి రావు. కలహాలు జరిగే పరిస్థితులు వచ్చినా దాని తీవ్రత తగ్గిపోతుంది. కలహాలు తగ్గడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మానసిక ప్రశాంతంత ఉన్నప్పుడే వ్యాపార, ఉద్యోగ విషయాల్లో స్థిమితంగా ఉంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ మనం చేస్తున్న వ్యాపార వ్యహరాలన్నీ సవ్యంగా సాగుతాయి. సంవత్సరంలో మొదటి రోజు మొదటి గంట ఇలా చేయడంతో అగ్నిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందండి.