
Jr NTR Foodie: తెలుగువారు భోజనప్రియులు అంటారు. అందరి సంగతేమోగానీ, నందమూరి హీరోలు మాత్రం కచ్చితంగా భోజనప్రియులే. ఈ విషయం ఎక్కడో ఓ చోట ప్రూవ్ అవుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. న్యూఇయర్‌ని ఫ్యామిలీతో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ న్యూయార్క్ రెస్టారెంట్‌ని విజిట్ చేశారు. అక్కడ ఇండియన్ వంటకాలను ఆయన టేస్ట్ చేశారు. సూపర్‌గా ఉందంటూ కితాబిచ్చారు. అంతే కాదు, అక్కడ రెస్టారెంట్‌లోని స్టాఫ్‌తో ఫొటోలు కూడా తీసుకుని తన ఖాతాల్లో పోస్ట్ చేశారు.
మన భోజనం మన దగ్గర అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ లెవల్లో అంతే రుచిగా ఎక్కడ దొరుకుతుంది. ఈ విషయం మీద అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ విషయంలో తారక్‌కి కూడా అంతే ఆసక్తి ఉన్నట్టుంది. అందుకే ఇండియన్ ఫుడ్ కోసం న్యూయార్క్ వీధుల్లో సెర్చ్ చేశారు. అక్కడ అద్భుతంగా భారతీయ వంటలు అందుబాటులో ఉండటంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఆ విషయాన్నే పోస్ట్ చేశారు.
ఈ ఏడాది ట్రిపుల్ ఆర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో చరణ్‌తో కలిసి ఆయన స్టెప్పులేసిన నాటు నాటు సాంగ్ ఇప్పుడు ఆస్కార్‌కి అల్లంత దూరంలో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్లకు షార్ట్ లిస్ట్ అయింది ట్రిపుల్ ఆర్‌లోని నాటు నాటు సాంగ్. ఇప్పుడు ఫారిన్‌లో సేద దీరుతున్న తారక్, తిరిగి వచ్చాక కొరటాల సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారు.
ఆ సినిమా గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ని మించేలా ఉంటుందట. జస్ట్ కమర్షియల్ విషయాలు మాత్రమే కాకుండా సొసైటీని ఆలోచింపజేసే కాన్సెప్ట్ తో ఉంటుందట. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రతి ఒక్కరినీ మెప్పించే సబ్జెక్ట్ తయారు చేశారట కొరటాల. 2023 ఎండింగ్‌లోగానీ, 2024 జనవరిలోగానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్‌లో ఉన్నారట మేకర్స్.
Railway Minister : ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ : రావ్ సాహెబ్ దన్వే