E-Paper
Advertisement

Significance of Donations : మనం చేసిన దానం ఫలించాలంటే ఆ ఒక్కపని చేయద్దు

Significance of Donations : మనం చేసిన దానం ఫలించాలంటే ఆ ఒక్కపని చేయద్దు
Advertisement

Significance of Donations : దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్ది పురుషుడు అన్న సామెత ఒకటి ఉంది. దానం ధర్మం చేయాలి కానీ చేస్తే మంచి మనసుతో ఏ ఫలితం ఆశించకుండా నీవు వారికి చేసినట్లయితే ఆ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించి నీకు తోడు నీడై ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సాటి మనిషి మన ఇల్లు వెతక్కుంటూ వచ్చినప్పుడు వారిని వట్టి చేతులతో పంపించడం బాగుండదు. నీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత నిత్యం ఇవ్వాలి. నువ్వు అన్నీ ఇవ్వనక్కర్లేదు నీకు కలిగినప్పుడు ఇచ్చినా తప్పులేదు. దానం చేసిన వెంటనే నీకు ఏదైనా కష్టం వస్తే అయ్యో నా దానం నన్ను కాపాడాలి కదా అని అనుకోవక్కర్లేదు. ఆ ఫలితం ఏదో ఒక రోజు నీకు లభిస్తుంది. ఏది ఎప్పుడు కాపాడుతుందో మనం చెప్పలేం ఆ ఈశ్వరుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు.

నిత్యజీవితంలో ప్రతి నిమిషం మన దేహాన్ని వినియోగించుకుంటున్నాం. అవసరమైన గాలి, నీరు, వెలుతురు, శక్తి, ఆహారాదులన్నీ ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం. అలా వినియోగించుకుని, ఆనందిస్తున్న దేహానికి అద్దె కట్టాలి కదా. ఈ ప్రకృతికోసమూ పన్ను కట్టాల్సి ఉంటుంది. వినియోగించుకున్న తర్వాత వాటికి రెంట్‌, టాక్స్‌ రూపాలలో తిరిగి ప్రకృతికి ఇవ్వని సందర్భంలో అవే సమస్యలుగా వస్తాయి.. ధనలోపం, ఆరోగ్యలోపం, ఆస్తుల కబ్జా, వస్తువులు పోగొట్టుకోవడం, వైవాహిక, సంతాన, ఉద్యోగ సంబంధ ప్రయోజనాలు కోల్పోవడమేగాక ఒత్తిడులకు గురవుతుంటాం. మనం ఈ లోకంలో ప్రకృతి నుంచి పొందుతున్న ప్రయోజనానికి తగిన విధంగా మళ్ళీ తిరిగి చెల్లించాల్సిందే.

Advertisement

ఉద్యోగ, వ్యాపారాదుల్లో పొందే ప్రయోజనాన్నిబట్టి దానం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. . ధర్మశాస్ర్తాల ప్రకారం మన ప్రతి సంతోషం, సంతృప్తి, ధనం, అధికారం, ఉన్నతికి సంబంధించిన వానిలో ఐదో భాగం దానం చేయాలి. మిగిలిన నాలుగు భాగాలనే మనం అనుభవించాలి. ఇంకా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందేవారు మరింత ఎక్కువ దానం చేయాలి. సాటి మనిషి లో ఒక మనిషిని చూడు నీకు ఉన్నప్పుడు ఏ ఫలితం ఆశించకుండా మంచి మనసుతో ఇవ్వు తప్పకుండా ఏదో ఒక రోజు నీకు ఆ శివుడి అనుగ్రహం లభిస్తుంది. దేన్నీ ఆశించకుండా ఇచ్చే దానం శ్రేష్ఠమైంది.

అనాథాశ్రమాలు, నిరుపేదల మనను అడగకుండా వారి పనుల్లో వారు ఉండే చిన్నస్థాయి ఉద్యోగులు, కూలీలు అందరిలో ఉన్న పరమాత్మను దర్శిస్తూ దానం చేయడం అవసరం. వస్తు, వస్త్ర, ధాన్య, ధన రూపాల్లో ఏ రకంగా దానం చేసినా మంచిదే.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×