BigTV English

Kavitha: ‘కవితక్క’ అంటూ చాట్.. సుఖేష్ వాట్సాప్ మేటర్ కలకలం..

Kavitha: ‘కవితక్క’ అంటూ చాట్.. సుఖేష్ వాట్సాప్ మేటర్ కలకలం..
sukesh chandrasekhar kavitha

Kavitha News(Delhi Liquor Case Updates) : కవితక్క ఫుల్‌గా ఇరుక్కుపోతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె పాత్రపై బలమైన సాక్షాలు బయటకి వస్తున్నాయి. అయితే, దర్యాప్తు సంస్థల నుంచి కాకుండా.. ఓ తీహార్ జైలు ఖైదీ వల్ల కవిత చిక్కుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. జైలు నుంచి వరుస లేఖలు రాస్తూ.. గులాబీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నారు. తన టార్గెట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అని చెబుతున్నా.. మేటర్ అంతా కవిత చుట్టూ తిరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.


బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్క్ చేసి ఉన్న కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి మూడు దఫాలుగా 45 కోట్లు ఇచ్చానంటూ సంచలన ఆరోపణలు చేశారు సుఖేష్. ఆ తర్వాత మరో లెటర్‌లో ఆ ఏపీ అంటే మరెవరో కాదు అరుణ్ పిళ్లై అంటూ బాంబు పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు పిళ్లై బినామీగా ఉన్నారంటూ ఈడీ భావిస్తుండటంతో సుఖేష్ చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం రేపాయి. ఆ పిళ్లై.. బీఆర్‌ఎస్‌కు చెందిన సౌత్ గ్రూప్ హెడ్ అంటూ పరోక్షంగా కవిత గురించి హింట్ కూడా ఇచ్చాడు సుఖేశ్. లేటెస్ట్‌గా నేరుగా ఎమ్మెల్సీ కవితతో జరిపిన వాట్సాప్ చాట్ ను రిలీజ్ చేసి మరింత సంచలనంగా మారాడు.

మొత్తం ఆరు పేజీల లేఖ. అందులో కవిత, టీఆర్ఎస్ అనే పేరుతో సేవ్ చేసి ఉన్న నెంబర్‌తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్సే ఎక్కువగా ఉన్నాయి. హాయ్ అక్క.. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశా.. ప్యాకెట్ మీకు అందజేస్తానని ఏకే చెప్పారు.. ఇలా సాగింది ఆ వాట్సాప్ చాట్. అటునుంచి ఓకే అనే రిప్లై వచ్చింది. ఇక, నెయ్యి అంటే క్యాష్ అని గత లేఖలోనే సుఖేష్ తెలిపాడు.


మీ నాన్న ఎలా ఉన్నారు? అంటూ కవిత పేరుతో ఉన్న నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్టు ఉంది. థ్యాంక్యూ అక్కా.. మా నాన్నకు ప్రస్తుతం కీమో జరుగుతోందంటూ సుఖేష్ ఆన్సర్ ఇచ్చినట్టు ఆ చాట్‌ను బట్టి తెలుస్తోంది. 98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్.. ఇలా కోడ్ నేమ్స్‌తో ఆ చాటింగ్ జరిగింది. ఇందులో ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్, ఎస్‌జే అంటే సత్యేంద్ర జైన్ అని తెలుస్తోంది.

అయితే, సుఖేష్ రిలీజ్ చేసిన చాట్‌పై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. చాటింగ్‌తో పలు తెలుగు పదాలు ఉన్నాయని.. మరి, తెలుగు భాష రాని సుశేష్ తెలుగు పదాలు ఎలా వాడాడని గులాబీ నేతలు డౌట్ పడుతున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఆరోపిస్తోంది.

సుఖేశ్ వాట్సాప్ స్క్రీన్ షాట్లలో ఉన్నది ఇదే..

సుఖేశ్ : అక్కా.. సారీ.. ఇబ్బంది పెడుతున్నా.. చిన్న వివరాలు కావాలి.

కవిత : హాయ్… ఇప్పుడే మీ మెసేజ్ చూశాను.

సుఖేశ్ : నో ప్రాబ్లమ్ అక్కా… ఏకే ప్యాకేజిని మీకు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉన్నది.

కవిత : ఎస్… ఓకే

సుఖేశ్ : నేను దీన్ని జేహెచ్ ఇంటికి పంపించనా?

కవిత : వద్దు.. వద్దు… అరుణ్ కు నేను ఫోన్ చేసి నీతో మాట్లాడమని చెప్తాను. దీన్ని ఆఫీసుకు పంపించాల్సి ఉంటుంది.

సుఖేశ్ : ఓకే అక్కా.. మీరు చెప్పినట్లు చేస్తాను.

కవిత : అతను కొద్దిసేపట్లో మీకు ఫోన్ చేస్తాడు.

సుఖేశ్ : షూర్ అక్కా.. ఎస్‌జే బ్రదర్ ఈ రోజే మీకు చేరవేయాల్సిందిగా చెప్పారు.

కవిత : ఎస్..

సుఖేశ్ : నేను సమన్వయం చేసుకుంటానులే అక్కా..

కవిత : మీ వైపు నుంచి అంతా ఓకే కదా… మీ డాడీకి ఆరోగ్యం ఇప్పుడెలా ఉన్నది?

సుఖేశ్ : వాకబు చేస్తున్నందుకు కృతజ్ఞతలు అక్కా.. ప్రస్తుతం కెమో థెరఫీ జరుగుతూ ఉన్నది.

కవిత : వెంటనే కోలుకుని బైటకు రావాలని కోరుకుంటున్నాను.

సుఖేశ్ : ఎస్ అక్కా.. దేవుడు కూడా అదే చేస్తాడనుకుంటున్నాను.

కవిత : టీసీ. నేను మళ్ళీ మాట్లాడతాను.

సుఖేశ్ : ఓకే అక్కా.. మీ ఇష్టం.. ఎప్పుడైనా.. కేసీఆర్ గారిని అడిగినట్లు చెప్పండి.

కవిత : నమస్తే ఎమోజీ

సుఖేశ్ : అక్కడా.. డెలివరీ చేసేశాను.

కవిత : ఓకే..

సుఖేశ్ : అక్కా.. ఏకేకి లేదా ఎస్‌జేకి ఇన్‌ఫామ్ చేయండి.

కవిత : మనీష్‌తో మాట్లాడాను.

సుఖేశ్ : ఓకే అక్కా.. థాంక్స్

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×