E-Paper
Advertisement

Smallest Car : టైర్లు, డోర్లు లేని వింత కారు..

Smallest Car : టైర్లు, డోర్లు లేని వింత కారు..
Advertisement
Smallest Car

Smallest Car : టెక్నాలజీ అనేది ప్రపంచ రంగునే మార్చేసింది. ప్రస్తుతం అన్ని కంపెనీలు, రంగాలు కూడా టెక్నాలజీ మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. అన్నింటితో పాటు ఆటోమొబైల్ రంగం కూడా టెక్నాలజీపైనే ఆధారపడి ముందుకు వెళ్తోంది. వాహనాలను స్టైల్‌గా మార్చడానికి, కస్టమర్లను సంతృప్తి పరచడానికి టెక్నాలజీ సాయాన్నే తీసుకుంటున్నాయి కంపెనీలు. తాజాగా అలా టెక్నాలజీతో తయారు చేసిన ఒక వింత కారు మార్కెట్లోకి వచ్చింది.

‘ప్రపంచంలోనే అతి చిన్న కారు ఏదో తెలుసా..?’ అంటూ తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు చూడడానికి వింతగా ఉన్నా కూడా దీని క్రియేటివిటీని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలామంది నెటిజన్లను ఈ కారు చాలా బాగా ఇంప్రెస్ చేసింది కూడా. ఎప్పటికప్పుడు కొత్త కార్లను తయారు చేయడానికి సిద్ధమవుతున్న ఆటోమొబైల్ రంగం.. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వారు భావిస్తున్నారు.

Advertisement

ట్విటర్‌లో ఒకరు షేర్ చేసిన ఈ కారు వీడియో.. తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. అసలు ఈ కారును చూస్తే.. ఇది కారు అని నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి డోర్లు లేవు, టైర్లు లేవు. అందుకే దీనిని చుట్టు పక్కన ఉన్న జనాలు వింతగా చూడడం మొదలుపెట్టారు. ఇది రోడ్డు మీద కదులుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ముందుగా ఈ వీడియో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ కాగా.. దానిని ఒక నెటిజన్.. ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ కారు గురించి చాలామందికి తెలిసింది.

డోర్లు, టైర్లు లేకపోయినా కూడా ఈ కారులో చాలావరకు లేటెస్ట్ టెక్నాలజీలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఒక రోబో టెక్నాలజీ ఇన్‌స్టాల్ అయ్యి ఉందట. దాంతో పాటు కారు ముందు ఒక గోప్రో కెమెరా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కెమెరా ద్వారా కారు ముందు వెళ్లే వాహనాల గురించి కారులో ఉన్నవారికి సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించిన పోస్ట్‌కు దాదాపు 38 మిలియన్ వ్యూస, 11.4 లక్షల లైక్స్ వచ్చాయి.

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×