BigTV English

Smart Phone Addiction : మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఇలా చేయండి..!

Smart Phone Addiction : పిల్లలను పెంచడం కొంచెం కష్టమైన టాస్కే.. కొన్ని సందర్భాల్లో పిల్లల ప్రవర్తన కారణంగా పేరెంట్స్ విసిగెత్తి పోతారు. వాళ్లని సరైన మార్గంలో పెట్టాలని టెన్షన్ పడుతుంటారు. ఈ ఆధునిక ప్రపంచం పేరెంట్స్ కష్టాలను మరింత పెంచేసింది. పిల్లలు ఫోన్లకు అతుకుపోతున్నారు.

Smart Phone Addiction : మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఇలా చేయండి..!

Smart Phone Addiction : పిల్లలను పెంచడం కొంచెం కష్టమైన టాస్కే.. కొన్ని సందర్భాల్లో పిల్లల ప్రవర్తన కారణంగా పేరెంట్స్ విసిగెత్తి పోతారు. వాళ్లని సరైన మార్గంలో ఉంచాలని టెన్షన్ పడుతుంటారు. ఈ ఆధునిక ప్రపంచం పేరెంట్స్ కష్టాలను మరింత పెంచేసింది. పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. భోజనం చేయాలన్నా, చదవాలన్న ఫోన్ కావాల్సిందే. పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ దూరం చేయడానికి పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఏమి చూస్తున్నారో? వారి ప్రవర్తన ఎలా ఎఫెక్ట్‌ అవుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? అనే బాధతో పేరెంట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవల My Peegu అనే ఎమోషనల్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫామ్ ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 61 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లల స్క్రీన్‌ టైమ్‌ గురించి టెన్షన్‌ పడుతున్నట్లు గుర్తించారు. పిల్లల అభివృద్ధికి బ్యాలెన్స్డ్‌ స్క్రీన్‌ టైమ్‌ అవసరమని My Peegu వ్యవస్థాపకుడు పేరెంటింగ్ నిపుణుడు చేతన్ జైస్వాల్ అన్నారు.

పేరెంట్స్ తమ పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడానికి కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాలి. వారి నుంచి బలవంతంగా ఫోన్ లాక్కోకూడదు. ముందుగా ఫోన్‌తో ఎంత టైమ్ గడుపుతున్నారో గుర్తించాలి. ఫోన్‌ను వినోదం కోసం ఉపయోగిస్తున్నారా.. లేదా ఫోన్‌కు బానిసయ్యరా అనేది తెలుసుకోవాలి. ఫోన్ తీసేస్తే వారు ఎలా స్పందిస్తున్నారో చూడాలి. వాటి ఆధారంగా పిల్లల దృష్టిని ఫోన్ నుంచి మార్చాలి.


కానీ కొందరు పేరెంట్స్ ఫోన్ స్క్రీన్ టైమ్ తగ్గిస్తే .. గిఫ్ట్ ఇస్తామని ఆశపెడుతూ ఉంటారు. ఈ విధంగా చేస్తే వాళ్లు గిఫ్ట్స్‌కు అలవాటు పడతారు. పేరెంట్స్ మీ టైమ్ కొంత పిల్లలకు ఇవ్వండి. వారితో ఆటలు ఆడించండి. వంటచేసేటప్పుడు వారి సహాయం తీసుకోండి. మీ పని చాలా ఈజీగా అవుతుంది.

పిల్లలు స్మార్ట్ ‌ఫోన్ వాడుతుంటే బలవంతంగా తీయకుండా.. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. పిల్లల్లో కొంత మార్పు వస్తుంది. భోజనం చేసే సమయంలో, చదువుకునే టైమ్‌లో, పడుకునే ముందు, మాట్లాడుకునే సమయంలో వాళ్లకు ఫోన్‌ ఇవ్వకండి. పాస్‌వర్డ్ సీక్రెట్‌‌గా ఉంచండి.

చాలా మంది పేరెంట్స్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతారు.. అలాంటప్పుడు మీ పిల్లలను ఫోన్ వాడొద్దని సలహా ఇస్తే వారు ఎలా వింటారు. కాబట్టి పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించండి. ఫోన్‌ ఎక్కువగా వాడల్సి వస్తే.. వారికి అర్థమయ్యేలా చెప్పండి. పిల్లలు ఫోన్ ఉపయోగించాల్సి వస్తే టైమ్ లిమిట్ సెట్ చేయండి.

18 నెలల వయస్సు ఉన్న పిల్లలు అసలు ఫోన్ స్క్రీన్ చూడకూడదు. 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు ఒక గంటకు మించి ఫోన్ చూడకూడదు. 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు సమయం వృధా కాకుండా టైమ్ లిమిట్ సెట్ చేయాలి. 18 నుంచి 24 సంవత్సరాల పిల్లలు పేరెంట్స్ సమక్షంలోనే ఫోన్ వాడాలి.

పిల్లలు పడుకునే బెడ్‌రూమ్‌లో ఫోన్లు ఉంచకండి. నిద్రపేయే సమయంలో వారికి ఫోన్ అందుబాటులో ఉంటే అది వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. అలానే చీకటి పడిన సమయంలో ఫోన్ స్క్రీన్‌కు దూరంగా ఉండాలి.

ఫోన్ నుంచి దృష్టి మళ్లించడానికి ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. వారు ఆడుకోవటానికి శరీర వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. శరీరం బాగా అలసిపోయినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కుటుంబ సభ్యులు మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×