BigTV English

Space Solar Power Project: స్పేస్ సోలార్ పవర్‌పై ప్రయోగాలు.. కరెంటు కష్టాలు తీర్చడానికి..

Space Solar Power Project: స్పేస్ సోలార్ పవర్‌పై ప్రయోగాలు.. కరెంటు కష్టాలు తీర్చడానికి..

Space Solar Power Project : ప్రపంచవ్యాప్తంగా మనుషుల అవసరాలు పెరిగిపోతున్నాయి. అలాంటి ముఖ్యమైన అవసరాల్లో కరెంటు కూడా ఒకటిగా మారిపోయింది. కానీ మానవాళికి సరిపడా కరెంటును సప్లై చేయడం కోసం ఎలక్ట్రిసిటీ రంగంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. అందుకే వారిపై ఆధారపడకుండా చాలామంది సోలార్ పవర్‌తో కరెంటు అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా మనవాళికి కలుగుతున్న కరెంటు కష్టాలను తొలగించడం కోసం శాస్త్రవేత్తలు కొత్త ఐడియాతో ముందుకొస్తున్నారు.


స్పేస్ నుండి నేరుగా భూమికి కరెంటు వస్తే ఎలా ఉంటుంది. సూర్యుడి ఎప్పుడూ అస్తమించని ప్రాంతం నుండి కరెంటు వస్తే ఎలా ఉంటుంది. అసలు వాతావరణం ప్రమేయమే లేకుండా కరెంటు అవసరాలు తీరిపోతే ఎలా ఉంటుంది. ఇలా జరిగితే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళి కష్టాలు తీరిపోతాయి. దీనినే స్పేస్ సోలార్ పవర్ అంటారు. ఇప్పుడు ఈ టెక్నాలజీని తయారు చేయడం కోసమే శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల కరెంటు సెక్టార్‌లోనే సంచలనం సృష్టించవచ్చని వారు చెప్తున్నారు.

స్పేస్ సోలార్ వపర్ కావాలంటే.. ఆర్బిట్‌లోకి సోలార్ ప్యానెల్స్‌ను పంపించాల్సి ఉంటుంది. అక్కడ సూర్యుడి వెలుగును కలెక్ట్ చేసి, వాటిని మైక్రోవేవ్స్ లాగా మార్చాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీనాలు వీటిని భూమికి పంపించి, కరెంటులాగా మారుస్తాయి. స్పేస్ సోలార్ పవర్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. కార్బన్ లేకుండా ఎనర్జీని తయారు చేయవచ్చని చెప్పారు. అంతే కాకుండా మానవాళి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడడం తగ్గిపోతుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు.


దేశం ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ కరెంటు కష్టాలు అన్నీ తీరిపోతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. కానీ స్పేస్ సోలార్ పవర్‌ను సాధించాలన్నా దానికి తగిన ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు బయటపెట్టారు. దీనికోసం పెద్ద పెద్ద పరికరాలను స్పేస్‌లోకి పంపించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పలు టెక్నికల్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఛాలెంజ్‌లను పక్కన పెట్టి మరీ.. ఎన్నో ప్రపంచ దేశాలు స్పేస్ సోలార్ పవర్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఇందులో ఒక బ్రేక్‌ను కూడా సాధించారు. వారు మొదటిసారిగా ఒక వైర్‌లెస్‌ను భూమి నుండి అంతరిక్షానికి పంపించారు. సిలికాన్ చిప్స్‌తో మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటర్స్‌ను తయారు చేశారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షం నుండి భూమికి కరెంటును తీసుకురావచ్చని తెలుసుకున్నారు. దీంతో స్పేస్ సోలార్ పవర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తయారు చేయవచ్చనే నమ్మకం అందరికీ కలిగింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×