BigTV English

Astronauts : ఆస్ట్రానాట్స్‌తో ముచ్చట్లు పెట్టగలిగే స్పేస్‌క్రాఫ్ట్స్..

Astronauts : ఆస్ట్రానాట్స్‌తో ముచ్చట్లు పెట్టగలిగే స్పేస్‌క్రాఫ్ట్స్..
Astronauts


Astronauts : ముందుగా ఆస్ట్రానాట్స్ అనేవారికి స్పేస్‌క్రాఫ్ట్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ స్పేస్‌క్రాఫ్ట్స్ సాయంతోనే ఆస్ట్రానాట్స్.. అంతరిక్షానికి చేరుకోగలరు. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలరు. ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేయగలరు. అయితే గత కొన్నేళ్లలో ఈ స్పేస్‌క్రాఫ్ట్స్ తయారీ అనేది చాలా విధాలుగా మారింది. టెక్నాలజీ మారుతుండడంతో ఎన్నో కొత్త రకమైన టెక్నాలజీలను కలిపి స్పేస్‌క్రాఫ్ట్స్‌ను తయారు చేయడం మొదలుపెట్టారు. తాజాగా అందులోకి మరొకటి యాడ్ అయ్యింది.

స్పేస్‌క్రాఫ్ట్ అనేది మామూలుగా సైలెంట్‌గా ఉండదు. ఎప్పటికప్పుడు ఆస్ట్రానాట్స్ ఏం చేయాలనే విషయంపై వారికి సూచనలు ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ స్పేస్‌క్రాఫ్ట్స్ అనేది ఫ్రెండ్లీగా ఆస్ట్రానాట్స్‌తో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. అందుకే చాట్‌జీపీటీ సాయంతో స్పేస్‌క్రాఫ్ట్స్‌ను ఆస్ట్రానాట్స్‌తో మాట్లాడే విధంగా తయారు చేయనున్నారు. నాసా ముందుగా ఈ విభాగంలో పనిచేయడానికి ముందుకొచ్చింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ సామర్థంతో తయారైన రోబోలు ఆస్ట్రానాట్స్‌తో మాట్లాడతాయి.


చంద్రుడిని, ఇతర గ్రహాలను స్టడీ చేయడానికి ఉపయోగపడే స్పేస్‌క్రాఫ్ట్స్‌లో మాట్లాడే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో నాసా ప్లాన్ చేస్తున్న మెషీన్‌లో ముందుగా ఈ టెక్నాలజీని ప్రయోగించి చూడాలని నిర్ణయించుకున్నారు. స్పేస్ వెహికల్స్‌లో మామూలుగా మాట్లాడగలగడం, అవి కూడా తిరిగి మనతో మాట్లాడడం, అలర్ట్స్ గురించి చెప్పడం, కనిపెట్టిన వాటిలో ఆసక్తికరమైన విషయాల గురించి ముచ్చటించడం.. ఇలాంటివన్నీ ఈ టెక్నాలజీతో సాధించాలని అనుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

స్పేస్ కమ్యూనికేషన్ విషయంలో ఈ టెక్నాలజీ అనేది ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ టెక్నాలజీ గురించి చర్చించడానికి నాసాకు సంబంధించిన పలువురు ఆస్ట్రానాట్స్ సమావేశమయ్యారు. ఇన్‌బిల్ట్ ఏఐ ద్వారా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్లవచ్చని వారు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పలు గ్లిచెస్ కూడా ఉండే అవకాశం ఉందని, దీనిపై ప్రయోగాలు మొదలుపెట్టిన తర్వాత ఒకొక్కటిగా పరిష్కరించుకుంటూ.. ఈ టెక్నాలజీని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×