BigTV English

Natarajan Indian cricketer : కలను నిజం చేసుకున్న యంగ్ క్రికెటర్..

Natarajan Indian cricketer : కలను నిజం చేసుకున్న యంగ్ క్రికెటర్..
Natarajan Indian cricketer


Natarajan Indian cricketer : ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ.. ఇటు మ్యాచ్‌లతో, అటు ఎండోర్స్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న క్రికెటర్లు చాలామంది ఒకప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవారే అయ్యింటారు. అందుకే అందులో చాలామంది సొంతంగా క్రికెట్ కోచింగ్ సెంటర్లు, గ్రౌండ్లు ఏర్పాటు చేసి క్రికెటర్లు అవ్వాలి అనుకుంటున్నవారికి సహాయపడుతుంటారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా యంగ్ క్రికెటర్ ఒకరు జాయిన్ అయ్యారు.

మామూలుగా క్రికెటర్లను ఇండియన్ టీమ్‌లోకి సెలక్ట్ చేయాలంటే ముందుగా వారి ఐపీఎల్ పర్ఫార్మెన్స్‌ను లెక్కించడం మొదలుపెడతారు. కానీ అతి తక్కువమంది క్రికెటర్లకు మాత్రమే ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా ఒకేసారి ఆడే అవకాశం వస్తుంది. అలాంటి వారిలో టి నటరాజన్ ఒకరు. ముందుగా రంజీ ట్రాఫీతో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన నటరాజన్.. తర్వాత అనేక టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. ప్రస్తుతం తను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో యాక్టివ్ క్రికెటర్‌గా ఉన్నాడు.


తమిళనాడులోని సాలెమ్ అనే గ్రామానికి చెందిన నటరాజన్ తండ్రి చేనేత కార్మికుడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అయినా తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో క్రికెటర్ అవ్వాలనే తన కలను నిజం చేసుకున్నాడు నటరాజన్. క్రికెటర్ అయిన తర్వాత తనలాగా మిడిల్ క్లాస్‌లో పుట్టి క్రికెటర్‌ అవ్వాలనుకుంటున్న ఎంతోమందికి ఫ్రీగా కోచింగ్ ఇచ్చే అకాడమీని స్థాపిస్తానని ఎన్నో సందర్భాల్లో తన కోరికను బయటపెట్టాడు. తాజాగా ఆ కోరికను నిజం చేసుకున్నాడు ఈ యంగ్ క్రికెటర్.

టి నటరాజన్ క్రికెట్ అకాడమీ అనే పేరుతో తాజాగా సాలెమ్ జిల్లాలోని చిన్నప్పంపట్టి అనే గ్రామంలో అకాడమీని ప్రారంభించాడు నటరాజన్. క్రికెటర్ దినేశ్ కార్తిక్ దీనిని శుభారంభం చేశాడు. తన ఊరిలోనే క్రికెటర్లను తయారు చేయడానికి ముందుకు వచ్చిన నటరాజన్‌ను అభినందించాడు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి క్రికెటర్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ముందుగా ఒక కమర్షియల్ వెంచర్‌గా దీనిని స్థాపించి యంగ్ క్రికెటర్లకు తానే స్వయంగా కోచింగ్ ఇస్తానని నటరాజన్ బయటపెట్టాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×