BigTV English

SpaceX Crew 6:వెనక్కి తగ్గిన స్పేస్‌ఎక్స్ క్రూ 6.. ఎందుకంటే..

SpaceX Crew 6:వెనక్కి తగ్గిన స్పేస్‌ఎక్స్ క్రూ 6.. ఎందుకంటే..

SpaceX Crew 6:స్పేస్ టెక్నాలజీలో ఇదివరకు కేవలం ప్రభుత్వాలు మాత్రమే భాగస్వామ్యం వహించేవి. కానీ గత కొన్నేళ్లలో ఈ రంగానికి బాగా పాపులారిటీ వచ్చింది. పెట్టుబడులు ఎక్కువయినా కూడా దానికి తగిన లాభాలు కూడా వస్తుండడంతో ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. అందులో ఒకటి ఎలన్ మస్క్ స్థాపించిన స్పేస్‌ఎక్స్. కానీ తాజాగా ఈ స్పెస్‌ఎక్స్‌కు గట్టి దెబ్బే తగిలింది.


ఎలన్ మస్క్.. స్పేస్‌ఎక్స్‌ను స్థాపించి మొత్తం స్పేస్ రంగాన్ని తనవైపు తిరిగి చూసేలా చేశాడు. ఇది ప్రారంభించినప్పటి నుండి ఎన్నో అద్భుతమైన పరిశోధనలకు సాయంగా నిలిచిన మస్క్.. కొత్తగా ఒక స్పేస్ షిప్‌ను ఆకాశంలో పంపించాలని నిర్ణయించాడు. నలుగురు ఆస్ట్రానాట్స్ ఉన్న ఈ స్పేస్‌ఎక్స్ మిషిన్‌ను గాలిలోకి ఎగరేసి తన సత్తా చాటాలనుకున్నాడు. క్రూ 6 స్పేస్‌షిప్ అంతరిక్షంలోనే ఆరు నెలలు ఉండేలా ప్లాన్ చేశాడు. కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. పలు సాంకేతిక కారణాల వల్ల క్రూ 6 గాలిలోకి ఎగరలేదు.

ఈ మిషిన్‌లో నాసా ఆస్ట్రానాట్స్ స్టీఫెన్ బోవెన్, వారెన్ హెబర్గ్‌తో పాటు యూఎఈకు చెందిన ఆస్ట్రానాట్ సుల్తాన్ ఆల్నెయాడి, రష్యన్ శాస్త్రవేత్త ఆండ్రే ఫెడ్యేవ్.. అంతరిక్షానికి ప్రయాణమవ్వాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రయాణానికి అంతా సిద్ధమయ్యింది. అంతరిక్షంలోనే ఆరు నెలల పరిశోధనలు చేయడానికి కావాల్సిన పరికరాలతో వారు సిద్ధంగా ఉన్నారు. మస్క్‌కు సంబంధించిన స్పేస్‌క్రాఫ్ట్‌లో ఒక రష్యన్ శాస్త్రవేత్తను ఆకాశానికి పంపాలనుకోవడం ఇది రెండోసారి. ఇక తనకు సంబంధించిన మిషిన్‌లో ఒక అరబ్ ఆస్ట్రానాట్ భాగమవ్వడం ఇదే మొదటిసారి.


నలుగురు ఆస్ట్రానాట్స్‌ను అంతరిక్షానికి తీసుకెళ్లాలనుకున్న స్పేస్‌ఎక్స్ క్రూ 6 మిషిన్.. ఫ్లోరిడాలోని కెన్నెడీ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుండి లాంచ్‌కు రెడీగా ఉంది. అప్పుడే దానిలో కొన్ని సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరు నెలలు గాలిలోనే ఉండాల్సిన స్పేస్ మిషన్‌ను మరింత సమర్థవంతంగా తయారు చేసిన తర్వాతే పంపించాలని నిర్ణయించుకుని లాంచ్‌ను ఉన్నపాటుగా ఆపేశారు. ఈ విషయాన్ని నాసా స్వయంగా ప్రకటించింది.

Lay Off Robots:రోబోలకు కూడా లేఆఫ్ తాకిడి.. గూగుల్ నిర్ణయం..

Forest Bathing:ట్రెండ్ సృష్టిస్తున్న ఫారెస్ట్ బాతింగ్.. వృద్ధుల కోసం..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×