BigTV English

Beer: కింగ్‌ఫిషర్ బీర్ల కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు.. మందుబాబుల సమ్మర్ కష్టాలు..

Beer: కింగ్‌ఫిషర్ బీర్ల కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు.. మందుబాబుల సమ్మర్ కష్టాలు..

Beer: మందుబాబుల కష్టాలు మామూలుగా ఉండవు. పాపం.. ఎవరికీ చెప్పుకోలేరు. బయటకు గట్టిగ అనలేరు. ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు గట్రా చేయనూలేరు. తాగుబోతుల కష్టం మరో తాగుబోతుకు మాత్రమే తెలుస్తుంది. కానీ, అతను అందరిలా కాదు. ఫిర్యాదు చేస్తే పోయేదేమీ లేదనుకున్నాడు. నేరుగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లాడు. కల్తీ మద్యం తాగుతుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.. మాకు కింగ్ ఫిషర్ బీర్లు కావాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.


ఏపీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్. అక్కడ మందుబాబులు నాణ్యమైన మందు కోసం నానాతిప్పలు పడుతున్నారు. బ్రాండెడ్ సరుకు దొరక్క.. దొరికిందాంట్లో అడ్జస్ట్ అవుతున్నారు. కానీ, తెలంగాణలో అలాకాదు. అడిగిన వారికి అడిగిన బ్రాండ్. వాటర్ అయినా దొరకదేమో గానీ.. లిక్కర్ అందుబాటులో లేని ఊరే లేదంటే నిజంగా నిజం.

అయినా, కొన్నిచోట్ల చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని రకాల బ్రాండ్లను మాత్రమే అమ్ముతున్నారు. అది మందుబాబులకు చిరాకు తెప్పిస్తోంది.


అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చల్లని కింగ్‌ఫిషర్ బీర్లు తాగుదామంటే దొరక్క బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక లాభం లేదని భావించిన బీరం రాజేశ్.. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ప్రజావాణిలో కంప్లైంట్ చేశాడు. అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు.

మనోడి కష్టాలు చాలానే ఉన్నాయి. ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావించాడు. జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయట. అందులో ఒక్కో బీర్‌కు 200 నుంచి 300 వరకు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారట. అంతేకాదు జిల్లాలో కల్తీ మద్యం కూడా పెద్దఎత్తున అమ్ముతున్నారని రాజేశ్ కంప్లైంట్ చేశాడు. ఆ కల్తీ మద్యం తాగుతుంటే.. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ వస్తోందని ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. తాను ప్రస్తావించిన విషయాలపై.. వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరాడు. మరి, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో?

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×