BigTV English
Advertisement

India : పాక్ జెండాపై ప్రేమ.. స్కూల్ నుంచి డిబార్.. అసలేం జరిగిందంటే..

India : పాక్ జెండాపై ప్రేమ.. స్కూల్ నుంచి డిబార్.. అసలేం జరిగిందంటే..

India : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారతీయుల్లో దేశభక్తి ఉరకలెత్తుతోంది. రక్తం మరిగిపోతోంది. భారత్ మాతాకీ జై నినాదాలు మారుమోగుతున్నాయి. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారంతా. ఎవరైనా, ఎక్కడైనా పాక్‌ను కాస్తైనా సపోర్ట్‌గా మాట్లాడితే ఇక అంతే. ఖేల్ ఖతం. పాకిస్తాన్ జెండాలను కాల్చడం, రోడ్లపై పడేసి తొక్కడం లాంటి ఘటనలు దేశమంతా జరుగుతున్నాయి. అలాంటిదే ఈ ఉదంతం.. ఓ అమ్మాయిని స్కూల్ నుంచి డిబార్ చేసేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


వైరల్ వీడియోలో ఏముందంటే..

యూపీలోని సహరాన్‌పూర్, గంగో ప్రాంతంలో జరిగిందీ ఘటన. పహల్గాం టెర్రర్ అటాక్‌ను నిరసిస్తూ.. స్థానిక యువకులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పాక్ జెండాలను చించేసి, కాల్చేసి.. నిరసన తెలిపారు. అటుగా వెళ్లే వాళ్లంతా పాక్ జెండాలను తొక్కుకుంటూ వెళ్లేలా.. కొన్ని ఫ్లాగ్స్ రోడ్డుపై అతికించారు. వాళ్లు వెళ్లిపోయాక.. 11వ తరగతి చదివే ఓ విద్యార్థిని అదే రూట్‌లో స్కూటీపై ఇంటికి వెళుతోంది. రోడ్డుపై పడున్న పాక్ జెండాలను చూసింది. ఆ జెండాను రోడ్డుపై నుంచి తీసేసేందుకు ప్రయత్నించింది. ఆమె అలా చేస్తుండగా పక్కనుంచి ఎవరో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ 12 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. ఆమె దేశ ద్రోహి.. భారత్‌కు వ్యతిరేకి.. పాకిస్తాన్ సపోర్టర్ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.


స్కూల్ నుంచి డిబార్

ఆ వీడియోను చూసిన స్థానిక హిందూ సంఘాలు.. ఆ స్టూడెంట్ ధరించిన యూనిఫాం ఆధారంగా ఆమె స్కూల్‌కు వెళ్లారు. వీడియోను చూపించి ఆ విద్యార్థిని ఎవరో గుర్తించారు. వెంటనే ఆమెను స్కూల్ నుంచి డిబార్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆ సంఘాల గొడవతో పాఠశాల యాజమాన్యం భయపడింది. ఆ స్టూడెంట్‌ను స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. అసలేం జరిగింది? విద్యార్థినిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం. ఆ కమిటీ రిపోర్ట్‌ను బట్టి.. రోడ్డుపై నుంచి పాక్ జెండాను తొలగించిన విద్యా్ర్థిని భవితవ్యం డిసైడ్ కానుంది.

జెండానే కదాని పీకేస్తే..

జెండానే కదాని తీసేస్తే.. చాలానే డ్యామేజ్ అవుతుందని ఇలాంటి ఘటనలను బట్టి తెలుస్తుంది. కాకపోతే అది పాకిస్తాన్ జెండా. అందులోనూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఘటన. అయితే, ముస్లిం మత జెండాకు, పాకిస్తాన్ జాతీయ జెండాకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. కలర్స్, డిజైన్, స్టార్.. ఇంచుమించు సేమ్ ఉంటాయి. వాటిని క్లియర్‌గా గుర్తుపట్టడంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. బహుషా అది ముస్లిం జెండా అనుకుని ఉంటుందో ఏమో.. అంటున్నారు. సోషల్ మీడియాలో ఆ స్టూడెంట్‌కు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చేసిన పనిని సపోర్ట్ చేయకపోయినా.. స్కూల్ నుంచి సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు.

ఏపీలోనూ సేమ్ టు సేమ్

ఇటీవల ఏపీలోని నంద్యాలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ధర్మ రక్షా దళ్ నేతృత్వంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పాక్ జెండాలను రోడ్లపై పడేసి వెళ్లారు. ఆ తర్వాత ఓ వర్గానికి చెందిన యువకులు ఆ జెండాలను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆ ఉదంతం సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ యువకులు తీరుపై విమర్శలు వచ్చాయి. ఏపీలోనూ పాకిస్తాన్ మద్దతుదారులంటూ అంతా మండిపడుతున్నారు.

Also Read : ఏపీలో పాకిస్తాన్ మద్దతుదారులు.. వీడియో వైరల్

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×