Gisborne Airport: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. రైళ్లు ఆ క్రాసింగ్ గుండా వెళ్లే సమయంలో గేటు వేస్తారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. రైళ్లు వెళ్లిన తర్వాత గేట్లు ఓపెన్ చేయగానే వాహనాలు వెళ్లిపోతాయి. అలా రైళ్లు ఎన్నిసార్లు వస్తే, అన్నిసార్లు వాహనదారులు ఆగాల్సిందే. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయా పరిస్థితులకు అనుగుణంగా రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు రైళ్లు వెళ్తుంటే వాహనాలు నిలిచిపోవడమే చూశాం. కానీ, ఓ రైల్వే లైన్ ఏకంగా ఎయిర్ పోర్టు రన్ వే మీదుగా వెళ్తుంది. విమానాలు టేకాఫ్ కావాలన్నా, ల్యాండింగ్ కావాలన్నా, రైళ్లు వెళ్లే వరకు ఆగక తప్పదు. ఇంతకీ ఈ వింతైన ఎయిర్ పోర్టు ఎక్కడ ఉందంటే..
న్యూజిలాండ్ లో వింతైన విమానాశ్రయం
రైళ్ల రాకపోకలను బట్టి విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ను నిర్ణయించే ఎయిర్ పోర్టు న్యూజిలాండ్ లో ఉంది. దీని పేరు గిస్బోర్న్ ఎయిర్ పోర్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైల్వే ట్రాక్, రన్ వే కలిసి ఉంటుంది. విమానాశ్రం రన్ వే పైనుంచి రైళ్లు వెళ్తుంటాయి. రన్ వే మధ్యలో ఈ ట్రాక్ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రన్ వే మీదుగా విమనాలు, రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి.
రైలు వెళ్లాలంటే ఏటీసీ అనుమతి ఉండాల్సిందే!
న్యూజిలాండ్ లోని నార్త్ ఐలాండ్ దగ్గరలో నిర్మించిన ఈ విమనాశ్రయం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి రైలు వెళ్లాలంటే కచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ATC)అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వే ట్రాక్ మీద రైలు ఉన్న సమయంలో విమానాలు రన్ వే మీదికి అనుమతించబడవు. రైళ్లు వెళ్లిన తర్వాతే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఉంటుంది. రైళ్లు ముందు వెళ్లాలా? విమానాలు ముందు వెళ్లాలా? అనేవి ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రైలు మార్గం మీద గిస్బోర్న్ అనే వింటేజ్ రైలు రాకపోకలు కొనసాగిస్తున్నది. ఈ రైలు గిస్బోర్న్ నుంచి మురివై వరకు నడుస్తుంది.
Today is #InternationalLevelCrossingAwarenessDay.
So here's the railway line that crosses the runway at Gisborne Airport in New Zealand; the tracks of the Palmerston North – Gisborne Line run straight across it. Here, train stops plane. pic.twitter.com/ZI9OsahFmM— Tim Dunn (@MrTimDunn) June 11, 2020
160 హెక్టార్లలో గిస్బోర్న్ విమానాశ్రయ నిర్మాణం
గిస్బోర్న్ విమానాశ్రయం మొత్తం 160 హెక్టార్లలో నిర్మించారు. ఈ విమానాశ్రయం మెయిన్ రన్ వే 1,310 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న విమానాలు ల్యాండింగ్ అయ్యేందు కోసం మూడు చిన్నరన్ వేలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ పోర్టులో వాతావరణ పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 2020లో నిర్మించారు. న్యూజిలాండ్ లోని అందమైన విమానాశ్రయాలలో ఇది కూడా ఒకటి. ఈ ఎయిర్ పోర్టు డోర్లు, రూఫ్, ఫిలర్స్ చెక్కతో నిర్మించారు. చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు న్యూజిలాండ్ వెళ్తే, తప్పకుండా ఓసారి ఈ విమనాశ్రయాన్ని చూసి రావడం మర్చిపోకండి.
Read Also: మల్కాజ్ గిరిలోనూ రైళ్లు ఆపండి.. కాచిగూడ కంటే ఇదే బెటర్!