BigTV English

Such Food Causes Cancer: అలాంటి ఆహారం వల్లే క్యాన్సర్..! తేల్చిన శాస్త్రవేత్తలు..

Such Food Causes Cancer: అలాంటి ఆహారం వల్లే క్యాన్సర్..! తేల్చిన శాస్త్రవేత్తలు..

Such Food Causes Cancer : ఈరోజుల్లో ఏ ఆహార పదార్థం తింటే ఆరోగ్యానికి మంచిది, ఎంత తింటే మంచిది అని తేల్చాడం కష్టంగా మారిపోయింది. ఏది తిన్నా దాని వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య తప్పదు అన్నట్టుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం, పంట పండించడానికి ఉపయోగిస్తున్న కెమికల్స్.. ఇవన్నీ కలిపి ఆహారాన్ని కూడా కలుషితం చేసేస్తున్నాయి. ఇక తాజాగా మనం వండుకొని తినే ఆహారం వల్ల క్యాన్సర్ రావడానికి కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.


కొన్ని ఆహార పదార్థాలను వండుకొని, లేదా వేడి చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలాకాలం క్రితమే శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే దేనినైనా ఎక్కువగా ఉడికించకుండా, వేడి చేయకుండా పచ్చిగా తినడమే మంచిదని అంటుంటారు. అయితే అలా ఎందుకు అంటారు అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. తాజాగా స్టాన్ఫార్డ్ శాస్త్రవేత్తలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై పరిశోధనలు నిర్వహించి, ఫైనల్‌గా కారణం తెలుసుకునే విషయంలో సక్సెస్ అయ్యారు.

ప్రతీ ఆహార పదార్థంలో డీఎన్ఏ ఉంటుందని, అయితే ఆ ఆహార పదార్థాన్ని వండే క్రమంలో ఆ డీఎన్ఏ పూర్తిగా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని కారణంగానే ఇలాంటి ఆహారం తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుందని వారు బయటపెట్టారు. వండిన ఆహారంలో దెబ్బతిన్న డీఎన్ఏ మనిషి శరీరంలోని జీర్ణాశయంలోకి వెళతుందని, ఆపై డీఎన్ఏలోకి చేరకుంటుందని చెప్తున్నారు. ఈ విధంగా అలాంటి ఆహారం తిన్నవారి డీఎన్ఏ కూడా దెబ్బతింటుంది. ఆపై జెన్యులో మార్పు వచ్చి, ఫైనల్‌గా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు.


ఇప్పటివరకు ఈ పరిశోధనలు ఎలుకపైనే జరిగాయి కాబట్టి ఇలాగే మనుషుల్లో జరుగుతుందా లేదా అని చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వేడి చేసిన ఆహారం.. మరీ ఇలాంటి పరిణామాలకు దారితీయకపోయినా ఎంతోకొంత మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది తాము తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయాలని అనుకుంటున్నారు. అది కొంతవరకు మంచి విషయమే అని వారు అంటున్నారు.

ఏ ఆహార పదార్థంలో అయినా.. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అందులో డీఎన్ఏ అనేది ఉంటుందని చాలామంది తెలియదు. అందుకే ఆ డీఎన్ఏను ఎక్కువగా వేడి చేయడం వల్ల కూడా ఏమవుతుందో వారికి తెలియదు. ఈ పరిశోధనల ప్రకారం ఏ ఆహారం అయినా ఎక్కువగా వేడి చేసి, వాటి ఒరిజినల్ డీఎన్ఏను పోగొట్టడం ద్వారా మనిషి ఆరోగ్యంపై ఎంతోకొంత ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే 20 నిమిషాల కంటే ఎక్కువగా దేనిని వండకూడదని సూచిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×