Herbs: ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన బహుమతులలో మూలికలు( హెర్బ్స్) ముఖ్యమైనవి. ఇవి కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా.. అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తక్షణ ఉపశమనం అందించడానికి.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ మూలికలను ఇంట్లో ఉంచుకోవడం చాలా తెలివైన పని. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాల్సిన 15 ముఖ్యమైన ఔషధ మూలికలు, వాటి ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. తులసి: తులసి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను టీలో వేసి తీసుకోవడం లేదా నేరుగా నమలడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
2. అల్లం:
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దీనిని తరచుగా తీసుకోవడం వల్ల కూడా వికారం వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో కూడా అల్లం చాలా బాగా ఉపయోగ పడుతుంది. అల్లంతో టీ, కషాయాలు లేదా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
3. పసుపు:
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాలలో పసుపు కలిగి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
4. వెల్లుల్లి:
సహజ యాంటీ బయాటిక్‌గా వెల్లుల్లి పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిని
పచ్చిగా లేదా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది
5. పుదీనా :
తలనొప్పి, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం అందించడంలో పుదీనా చాలా బాగా ఉయోగపడుతుంది. ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది.
చట్నీ, టీ, లేదా జ్యూస్ గా చేసి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.
6. ధనియాలు:
జీర్ణ సమస్యలకు.. ముఖ్యంగా జీర్ణ సంబంధిత వాపును తగ్గించడానికి ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. నీటిలో నానబెట్టిన ధనియాల నీరు లేదా పొడి రూపంలో వాడడంవల్ల కూడా మంచ ఫలితం ఉంటుంది.
7. మెంతులు:
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.
రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం తినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉటాయి.
8. లవంగాలు:
దంతాలు, చిగుళ్ల నొప్పులను తగ్గించడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో మేలు చేస్తాయి. నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ప్రతి రోజు ఉదయం ‘గోల్డెన్ డ్రాప్’.. చలికాలంలో ఆరోగ్యానికి నెయ్యి దివ్య ఔషధం !
9. దాల్చిన చెక్క:
రక్తంలో చక్కెర నియంత్రణకు, యాంటీఆక్సిడెంట్లకు దాల్చినచెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా టీలో వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఎలా వాడాలి: టీ లేదా ఆహారంలో పొడి రూపంలో వాడడం.
10. వేప:
చర్మ సమస్యలకు (మొటిమలు, ఇన్ఫెక్షన్లు) ఉత్తమమైన యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలకు ప్రసిద్ధి చెందిన వేప ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి వేప ఆకులను వేడి నీటిలో వేసినా లేదా నూనె వాడినా కూడా మంచి ఫలితంఉంటుంది.