E-Paper
Advertisement

Rashmika Mandanna : శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మికా మందన్న? బ్యాచ్ లో ఆ ప్రముఖ హీరోయిన్

Rashmika Mandanna : శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మికా మందన్న? బ్యాచ్ లో ఆ ప్రముఖ హీరోయిన్

Rashmika Mandanna : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో రష్మికా మందన్న ఒకరు. ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోకుండా నచ్చిన పాత్రను మాత్రమే చేయడం మొదలుపెట్టింది. అందుకనే రష్మిక ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ రోజుల్లో నటీనటులు చేసిన పాత్రలు గుర్తించబడటం అనేది అసలైన అచీవ్మెంట్. అలా రష్మిక ప్రస్తావన వస్తే డియర్ కామ్రేడ్ లిల్లీ, ది గర్ల్ ఫ్రెండ్ భూమా , పుష్ప శ్రీవల్లి ఈ పాత్రలు కొంతమేరకు ప్రత్యేకమైనవి. అయితే సెలబ్రిటీలు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న తరుణంలో ఆ సెలబ్రిటీలను ఫాలో అవటం వాళ్ళ వ్యక్తిగత సమాచారాలను కూడా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ సహజంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ తో రష్మిక రిలేషన్ లో ఉన్న సంగతి కూడా బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

విజయ్ దేవరకొండ తో రష్మిక 

పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాతో వీళ్ళిద్దరూ మొదటిసారి కలిసిన నటించారు. ఆ తర్వాత వీరు చేసిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది కానీ డియర్ కామ్రేడ్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.

ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా వీళ్ళ మధ్య బాండింగ్ మాత్రం బలంగా మారింది. అప్పటి నుంచే వీళ్ళిద్దరూ ప్రేమ పక్షులులా విదేశాలు తిరగడం మొదలుపెట్టారు. విదేశాల్లో వీరిద్దరూ కలిసి ఒకచోట కనిపించకపోయినా ఒకే లొకేషన్ లో వీరిద్దరూ వేర్వేరుగా దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చేవి.

ఈ రోజుల్లో ఒక పోస్ట్ పెడితే దాని వెనుక కథను చాలా ఈజీగా అల్లుతారు నెటిజన్స్. మరోవైపు వీళ్లిద్దరూ పలు సందర్భాల్లో ఒకే టైం కి ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అయిపోయింది. అని ఇప్పటివరకు దాని గురించి అధికారక ప్రకటన ఇవ్వలేదు.

బ్యాచిలర్ పార్టీ ఇచ్చారా? 

మరోవైపు పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ బిజీగా మారిపోయింది రష్మిక మందన్న. ఈ తరుణంలోనే తన షెడ్యూల్ కూడా కంప్లీట్ బిజీగా మారిపోయింది. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ కి కూడా రాలేని పరిస్థితిలో ఉన్న బిజీ షెడ్యూల్ ఆవిడది.

మొత్తానికి రెండు రోజులు తనకి గ్యాప్ దొరకడంతో తన స్నేహితులతో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది రష్మిక. ఈ ట్రిప్ లో తన గ్యాంగ్ గర్ల్స్ లో కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, అలానే ప్రముఖ హీరోయిన్ వర్ష కూడా కనిపించారు. ఈ శ్రీలంక ట్రిప్ క్యాజువల్ గా వేసిన కూడా దీని చుట్టూ చాలా కథనాలు అల్లుకుంటున్నాయి.

రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ కు ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే వీళ్ళ పెళ్లి అధికారికంగా నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అని విశ్వసినీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది ఈ తరుణంలోనే తన గర్ల్స్ బ్యాచ్ శ్రీలంకలో బ్యాచిలర్ ట్రీట్ రష్మిక ఇచ్చింది అని సమాచారం వినిపిస్తుంది. ఇక దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా రష్మిక ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Also Read: David Reddy : మంచు మనోజ్ పర్ఫెక్ట్ కం బ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇలా ఉండాలి

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×