E-Paper
Advertisement

Top 20 News Today: యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు, మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

Top 20 News Today: యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు,  మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

1. మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులర్పించిన రాహుల్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు ఘన నివాళులర్పించారు. మన్మోహన్ దార్శనికత, సాహసోపేత నిర్ణయాలు దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రపంచ వేదికపై కొత్త గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. ఆయన వినయం, కృషి, నిజాయితీ ఎల్లప్పుడూ మనందరికీ ప్రేరణగా నిలుస్తాయ పేర్కొన్నారు.

2. రాజేంద్రనగర్ జోన్ తొలి కమిషనర్‌గా అనురాగ్ జయంతి

జీహెచ్‌ఎంసీ నూతనంగా ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ జోన్ తొలి కమిషనర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. కొత్త జోన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

3. భద్రాచలంలో ఘనంగా నిర్వహించిన నవకోటి జప త్రింశతి పూర్ణాహుతి మహాయజ్ఞం

భద్రాచలంలో బ్రహ్మశ్రీ సద్గురు శివకేశవ జగన్నాథస్వామి ఆశ్రమ సేవా సమితి ఆధ్వర్యంలో నవకోటి జప త్రింశతి పూర్ణాహుతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. లక్ష తులసి దళార్చన, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వంటి విశేష ఘట్టాల అనంతరం 25 కేజీల కర్పూర జ్యోతిని వెలిగించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

4. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రోడ్డులోని రైల్వే గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో దిడిగికి చెందిన రాజు, కర్ణాటకకు చెందిన ఆసిఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

5. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన అయ్యప్ప మహా పడిపూజ

జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహానికి అభిషేకం, అష్టాదశ సోపాన పూజలు నిర్వహించి, 18 మెట్లపై కర్పూర జ్యోతులు వెలిగించారు. భక్తుల శరణుఘోష, భజన సంకీర్తనలతో మంత్రి క్యాంపు కార్యాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

6. ఖమ్మంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మైనర్ బాలిక

ఖమ్మంలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేటిలో బాలిక డెడ్‌బాడీ లభ్యమైంది. ఒరిస్సా నుంచి ఇటుక బట్టీల్లో పనిచేయడానికి వచ్చిన కూలీగా ఆమెను గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.

7. దారుణం.. యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు

మహబూబాబాద్‌లో యూరియా కోసం రైతులు చలిలో పడిగాపులు కాస్తూ.. చెప్పులను క్యూలో ఉంచి నిరసన తెలిపారు. పంపిణీలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినప్పటికీ.. తమ కష్టాలు తీరకపోతే పోరాటం ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

8. ట్యాంకర్ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం..

సూర్యాపేట జిల్లా బెట్టేగూడెం శివారులో లోడుతో వెళ్తున్న గణేష్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి పొలంలో బోల్తా పడింది. విజయవాడ నుంచి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి 29.5 టన్నుల ఫ్లైయాష్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

9. శ్రీకాకుళం జిల్లాలో సైకిల్ యాత్ర.. ఎందుకంటే?

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించారు. అచ్యుతాపురం నుంచి నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

10. విశాఖలో వంగవీటి మోహనంగా వర్ధంతి వేడుకలు

విశాఖ పాత గాజువాకలో వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పాత గాజువాక నుంచి శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం వరకు అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు.

11. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అలిపిరి సమీపంలో రెండు రోజులుగా కారు అక్కడే ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు కారు తలుపులు తీసి చూడగా అందులో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గుగులోతు సర్ధార్ నాయక్ విగతజీవిగా పడి ఉండటం సంచలనంగా మారింది.

12. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్‌చల్

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి-సుంకి రహదారిపై శుక్రవారం ఉదయం గజరాజులు హల్‌చల్ చేశాయి. ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో, రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రేకర్స్ తక్షణమే రంగంలోకి దిగారు. ఏనుగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా చాకచక్యంగా వ్యవహరించారు. అటవీ శాఖ సిబ్బంది వాహనాలను సురక్షిత దూరంలో నిలిపివేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. గజరాజుల గుంపు మెల్లగా రోడ్డు దాటి సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి వెళ్లిన తర్వాత వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అడవులకు సమీపంలో ఉన్న రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

13. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వెంకటేష్

తిరుమల స్వామివారిని భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, వేద పండితుల ఆశీర్వచనాలతో పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు.

14. వెంకన్న సేవలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఏంపీ రాజీవ్ శుక్లా

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఎంపీ రాజీవ్ శుక్లా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

15. తిరుమల సన్నిదిలో గవర్నర్ ఆర్ఎన్. రవి

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్. రవి తిరుమల స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా.. టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

16. తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని చూస్తున్న కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ఉన్‌ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సంబంధిత అధికారులకు కిమ్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

17. బుందేలీ భాషలోకి రామాయణం

సంస్కృతంలోని వాల్మీకి రామాయణం స్ఫూర్తితో తులసీదాస్‌ అవధీ భాషలో రామచరిత మానస్‌ రాయగా.. దీనిని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాల్‌ఖాన్బుందేలీ భాషలోకి అనువదించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బిజ్నా గ్రామానికి చెందిన లాల్‌ఖాన్‌ బాల్యం నుంచే రామాయణం నా జీవితంలో భాగమైపోయింది పేర్కొన్నారు.

18. ఢీల్లీలో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం

దిల్లీలో రోజురోజుకు తీవ్రమవుతోన్న వాయు కాలుష్యం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశరాజధానిని పీడిస్తున్న ఈ సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ప్రయోజనాలు కలిగించే విధానాల కంటే.. దీర్ఘకాల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్‌ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

19. తొలి బంతికే డకౌట్ అయిన రోహిత్

విజయ్‌ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో శతకంతో అలరించిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ నేటి మ్యాచ్‌లో నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌ అయి పెవిలియన్‌కు చేరాడు.

20. హిట్ సినిమాలు ఖాతాలో వేసుకుంటున్న తేజ సజ్జా..

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు యువ నటుడు తేజ సజ్జా. తాజాగా ఆయన ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. కెరీర్‌ విషయాలు, తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. దేనికైనా సమయం రావాలని అన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×