E-Paper
Advertisement

Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్

Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్
Advertisement

1. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్, తెలంగాణ భవన్‌లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రభుత్వ తప్పులను ఎండగట్టకుండా తనను అడ్డుకున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టిస్తారని, భౌతిక దాడులకు కూడా వెనుకాడరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

2. మాటలకే పరిమితం

గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని, జగన్ హామీలు మాటలకే పరిమితమయ్యాయని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు.

3. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఎమ్మెల్సీ కామెంట్స్

Advertisement

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పది తలల రావణాసురుడినే రాముడు అంతం చేశాడని.. ఒక్క తల ఉన్న నిన్ను వదిలేస్తామా అంటూ మండిపడ్డారు. దశాబ్దాలుగా నమ్ముకున్న కార్యకర్తలను విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

4. థాంక్యూ హైడ్రా..

హైదరాబాద్ బౌరంపేటలోని డాలర్ మెడోస్ విల్లా నివాసితుల 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2008 నుంచి సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు దుండిగల్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేశారు.

5. డంపింగ్ యార్డు మార్చాలి

Advertisement

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ శివనేనిగూడెంలో జనావాసాల మధ్య ఉన్న చెత్త డంపింగ్ యార్డ్‌ను బీజేపీ నేతలు పరిశీలించారు. చెత్తను కాల్చడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వారు మండిపడ్డారు. తక్షణమే డంపింగ్ యార్డును మార్చాలని డిమాండ్ చేశారు.

6. మహోన్నత శక్తి

గుంటూరులోని లక్ష్మీపురం కూడలిలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని జీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. వాజపేయి అంటే ఒక మహోన్నత శక్తి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వాజపేయిని గౌరవిస్తాయని, కార్గీల్ యుద్దంలో ఆయన వ్యూహం అద్భుతం అని కొనియాడారు.

7. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫైర్

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమై, 9,000 కోట్ల రూపాయలు వృథాగా చెల్లించారని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు 1.50 రూపాయలకే యూనిట్, చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తోందని పేర్కొన్నారు.

8. ప్రజారోగ్యానికి పెద్దపీట

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి సందర్శించారు. 108 సర్వీసులపై వచ్చిన అసత్య వార్తలను ఆయన ఖండించారు. జగన్ హయాంలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

9. ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా నున్నలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గౌతు లచ్చన్న బస్ షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైసీపీ నేత భీమవరపు నరేంద్ర రెడ్డి చించివేయడంతో వివాదం మొదలైంది.

10. సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ‘సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. జగన్.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గం అన్నారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

11. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్

బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీళ్లు, నిధుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి బయటపెడుతుంటే.. కేటీఆర్, హరీష్‌రావు తట్టుకోలేకపోతున్నారన్నారు. అందుకే అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ.

12. తిరుమల కొండ పైకి మద్యం సరఫరా

తిరుమల పోలీస్ అతిథి గృహం వద్ద పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా వైఫల్యం వల్లే మద్యం కొండపైకి చేరుతోందని భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

13. ప్రేమ వ్యవహారమే కారణం..

మంగళగిరిలో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు పాల్పడిన కరాటే మాస్టర్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని, బాలికను సురక్షితంగా కాపాడారు. వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

14. గొప్ప నాయకుడు

ఏలూరు జిల్లా కె.ఆర్.పురం ఐటీడీఏలో ప్రముఖ గిరిజన నాయకుడు జైపాల్ సింగ్ ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. ముండా గొప్ప క్రీడాకారుడు, రాజనీతిజ్ఞుడని నేతలు కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

15. ఉచిత నేద్ర వైద్య శిబిరం

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుమారుడు సందీప్ పుట్టినరోజును పురస్కరించుకుని కందుకూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శంకర నేత్రాలయ సహకారంతో వందలాది మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

16. రోడ్లపై సంబరాలు

వెనియెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. నార్కో-టెర్రరిజం నుంచి తమకు స్వేచ్ఛ లభించిందని భావిస్తూ యూఎస్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

17. ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది. ప్రియాంక కమిటీలో లోకసభ ఎంపీలు ఇమ్రాన్‌ మసూద్‌, సప్తగిరి శంకర్‌ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్‌ను సభ్యులుగా నియమించారు.

18. మరోసారి పెరోల్

హత్య, అత్యాచారం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా 40 రోజుల పెరోల్ మంజూరైంది. 2017లో దోషిగా తేలిన తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రావడం ఇది 15వ సారి. ఈ పెరోల్ సమయంలో ఆయన యూపీలోని బాగ్‌పత్ ఆశ్రమంలో ఉండనున్నారు.

19. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం బంగ్లాదేశ్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో భారత్-బంగ్లాదేశ్ దౌత్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ 2026 ఒప్పందాన్ని కోల్పోయిన స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌కు చోటు లభించింది.

20. ఓటీటీలోకి అఖండ-2

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2: తాండవం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సనాతన ధర్మం నేపథ్యంతో అలరించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×