Varanasi Movie : మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి మూవీ… ఇన్నాళ్లు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో లాక్కొచ్చారు. రీసెంట్‌గా ఓ భారీ ఈవెంట్ పెట్టి… ఆ సినిమాకు వారణాసి అనే టైటిల్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడిన మాటలు ఇప్పటికే వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై కేసు పెట్టేంత వరకు వెళ్లింది అది.
ఇప్పుడు మరో వివాదం జక్కన్న మెడకు చుట్టుకుంది. ఆయన మాటల పంచాయితీ అలా ఉండగానే… వారణాసి పేరుపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
SSMB 29 మూవీకి వారణాసి అనే టైటిల్ ప్రచారంలో ఉండగానే… సడన్‌గా వారణాసి మూవీ అంటూ ఓ పోస్టర్ వచ్చింది. అయితే అది రాజమౌళి – మహేష్ బాబు మూవీది కాదు. CH సుబ్బరెడ్డి అనే డైరెక్టర్ ఈ వారణాసి అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన పోస్టర్‌నే విడుదల చేశాడు. CH సుబ్బరెడ్డి 2014లో.. ఆది సాయికుమార్‌తో రఫ్ అనే మూవీ చేశాడు.
CH సుబ్బరెడ్డి ముందుగా వారణాసి పేరుతో సినిమా అనౌన్స్ చేశాడు. CH సుబ్బరెడ్డి తన సినిమా అనౌన్స్ చేసిన కొద్ది రోజుల తర్వాత రాజమౌళి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో వారణాసి పేరును తన సినిమా టైటిల్‌గా అనౌన్స్ చేశాడు. దీంతో CH సుబ్బరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ మెట్లు ఎక్కాడు. తన సినిమా టైటిల్‌ను రాజమౌళి కాపీ కొట్టాడు అంటూ ఫిర్యాదు చేశారు.
రాజమౌళి వర్సెస్ CH సుబ్బరెడ్డి అంటే… అందరి సపొర్ట్ రాజమౌళికే ఉండొచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఓ పద్దతి అనేది ఉంటుంది. ఆ పద్దతి ప్రకారం వెళ్లాలి. ఆ.. పద్దతి ప్రకారం… చూస్తే ఈ వ్యవహారంలో తప్పంతా.. జక్కన్నదే ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఎవరు సినిమా చేసినా… చేయాలని అనుకున్నా… ముందుగా ఫిల్మ్ ఛాంబర్‌లో ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుంది.
అయితే… వారణాసి విషయంలో.. జక్కన్న ఫిల్మ్ ఛాంబర్‌లో ఎలాంటి రిజిస్టేషన్ చేసుకోవలేదని సమాచారం అందుతుంది. వారణాసి టైటిల్ పై ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టేషన్ చేసుకున్నది రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ పైన CH సుబ్బరెడ్డి మాత్రమేనంట. ఒక తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ భాషల్లో కూడా రిజిస్టర్ చేసుకున్నారని తెలుస్తుంది.
కానీ, రాజమౌళి మాత్రం.. ఈ టైటిల్‌ను ఎక్కడా రిజిస్టర్ చేయకుండా… డైరెక్ట్ అనౌన్స్ చేశారంట. దీంతో ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం వెళ్తే వారణాసి టైటిల్ CH సుబ్బరెడ్డికి మాత్రమే చెందుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ట్రెస్టింగ్ టాపిక్ అయింది.
ఇప్పుడు జక్కన్న ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. SSMB 29 మూవీకి వారణాసి కాకుండా వేరే టైటిల్‌ను పెట్టుకోవాలి. లేదా… CH సుబ్బరెడ్డికి తో సెటిల్మెంట్ చేసుకుని.. ఆ టైటిల్‌తోనే ముందుకు వెళ్లాలి. మరి చూడాలి.. జక్కన్న వేరే టైటిల్ వైపు మొగ్గుచూపుతాడా ? లేదా సెటిల్మెంట్ చేసుకుంటాడా ?
ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో తెలియడంతో… జక్కన్నపై సీరియస్ అవుతున్నారు. ఆయన విధానం కరెక్ట్ కాదని.. ఆయన మోనోపాలి లా వ్యవహిరిస్తున్నారు అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా… ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా… ఇండస్ట్రీలో ఉండే మినిమం రూల్స్ ని పాటించాలనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఇప్పుడు వారణాసి వివాదం ఇలా ఉండగా, 15 ఏళ్ల క్రితం కూడా CH సుబ్బారెడ్డికి ఇలాంటిదే ఎదురైంది. ఇదే మహేష్ బాబు హీరోగా చేసిన ఖలేజ మూవీని ముందుగా ఈయనే ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ తన మూవీ టైటిల్‌గా ఖలేజ అని అనౌన్స్ చేశారు. ఆ టైంలో… CH సుబ్బారెడ్డి ఓ మెట్టు దిగి.. తాను రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను మహేష్ బాబు – త్రివిక్రమ్ లకు ఇచ్చేశాడు. 17 ఏళ్ల తర్వాత… మళ్లీ మహేష్ బాబు సినిమాకే ఈ టైటిల్ వివాదం వచ్చింది.