జూబ్లీహిల్స్ నివాసంలో అనలాగ్ AI ఫౌండర్ సీఈవో అలెక్స్ కిప్‌మన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, క్లైమేట్ ఛేంజ్ ప్రిడిక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీఈవోకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ స్పీకర్. ఈ క్రమంలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో స్పష్టం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. నిధులు లేక గ్రామపంచాయతీల అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలందర్ని ఏకతాటిపైకి తెచ్చింది వందేమాతర గీతం అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగునూరు వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విద్యార్థులతో సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వందేమాతర గీతం స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిందని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట జక్కాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది.అతి వేగంతో వెళ్తున్న కారు ఓవర్ టర్న్ చేసి మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడ్డారు. వెనుక నుంచి వస్తున్న కారు డ్యాష్ బోర్డు కెమెరాలో.. ఈ ప్రమాదం దృశ్యాలు రికార్డు అయ్యాయి.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా 30 నిమిషాలపాటు కోర్టులోనే ఉన్నారు జగన్. జగన్ అప్పియరెన్స్ రికార్డ్ చేయడంతో నాంపల్లి కోర్టు పిటిషన్ ముగించింది. కేవలం మూడు నిమిషాలపాటు మాత్రమే జగన్ కేసు విచారణ జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ముప్పు ఉందన్నారు. ఇప్పటికీ తమ ఫ్యామిలీని బెదిరిస్తున్నారంటూ చెబుతున్నారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామన్నారు భువనేశ్వరి.
తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు విరాళం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. గ్లోబల్ హిందు హెరిటేజ్ ఫౌండేషన్, సేవా టెంపుల్స్ ఆర్గనైజేషన్ పేర్లతో కొందరు అక్రమంగా విరాళాలు సేకరిస్తున్నారని చెప్పారు. అక్రమార్కుల బారిన పడొద్దని సూచించారు బీఆర్ నాయుడు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య అంత్యక్రియలు ముగిసాయి. ఒకే చితిపై దంపతులిద్దరికి దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబసభ్యులు. అంత్యక్రియలకు గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. CRPF సిబ్బంది మృతదేహాలను స్వగ్రామం పువర్తికి తరలించి.. భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు చేశారు.
వైసీపీపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు తనను పట్టించుకోవడం లేదంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదనుకోవడం వైసీపీ భ్రమేనని చెప్పారు ఆదినారాయణ.
జూబ్లీహిల్స్‌లోని వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆయన్ని విచారించనున్నారు. ఈ కేసులో సేకరించిన డాక్యుమెంట్లు, స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారణ జరుపనున్నారు.
రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాద వశాత్తు భారతి అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు తెలుస్తుంది. మృతురాలు భారతి శ్రీకాకుళం జిల్లా వాసి. డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించి.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రూపాయి నోటుకు అరకేజీ చికెన్ అందించే వినూత్న విధానాన్ని ఒక షాప్ నిర్వాహకుడు ప్రారంభించాడు. విజయనగరం జిల్లా రాజాంలో ఓ నిర్వాహకుడు ప్రారంభించాడు. ఈ ఆఫర్ కారణంగా స్థానికులు పెద్ద ఎత్తున చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపార అభివృద్ధి కోసమా, లేక పాత నోట్ల ప్రచారం కోసమా అనే చర్చ నడుస్తోంది.
పిఠాపురం జనసేన పార్టీలో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ మేళం రామకృష్ణ పెట్టిన ‘జిమ్మిక్కులు’ పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. రేపు జరగబోయే టౌన్ ఆత్మీయ సమావేశం నేపథ్యంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీని కలవరపెడుతున్నాయి.
రెండు ఎన్‌కౌంటర్లలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అల్లూరి జిల్లా రంపచోడవరం వద్ద జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారని, 50 మందిని అరెస్టు చేశామని తెలిపారు. హెడ్మా, శంకర్‌లను హతమార్చడం ప్రధాన విజయమన్నారు.
భారత్-పాక్ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చాటింపు వేసుకున్నారు. ఉద్రిక్తతలను ఆపేందుకు రెండు దేశాలను సుంకాలతో బెదిరించినట్లు చెప్పారు. ప్రధాని మోడీ తాము యుద్ధానికి వెళ్లబోమంటూ తనకు ఫోన్ చేసినట్లు తెలిపారు ట్రంప్.
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్‌పుర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్-ఫలా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ప్రధాని మోడీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో దుమారం రేపాయి. దీనిపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చితే.. ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారు? అని ప్రశ్నించారు. మోడీ వ్యూహాలు బాగున్నాయని.. భావిస్తే అందుకు తగిన ఆధారాలతో వివరణ ఇవ్వాలని నిలదీశారు సందీప్ దీక్షిత్.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ బంపరాఫర్‌ని ప్రకటించారు. ఈ మూవీ టికెట్ ధరను తగ్గించినట్లు మూవీయూనిట్ తెలిపింది. దీంతో సింగిల్ థియేటర్‌లలో ఈ చిత్రం 99లకే అందుబాటులో ఉండబోతుండగా.. మల్టీప్లెక్స్‌లలో 105గా నిర్ణయించారు.
బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. ఢాకాలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తన కెరీర్‌లో 13వ సెంచరీ సాధించాడు. 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతూ.. రహీమ్ ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.