Jagga Reddy Teaser Launch..ప్రముఖ రాజకీయ నాయకులు జగ్గారెడ్డి (Jagga Reddy)తాజాగా తన రాజకీయ జీవిత కథతో జగ్గారెడ్డి (Jagga Reddy)అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న జగ్గారెడ్డి.. ఈ సినిమా స్టోరీ గురించి అభిమానులతో పంచుకున్నారు.జగ్గారెడ్డి టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..” నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. సాధారణంగా సినిమాలలో హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తారు. దర్శకుడు చెప్పినట్టు పోలీసులను కొట్టినట్లు, వాళ్లతో ఫైట్ చేసినట్లు నటిస్తారు. కానీ నేను మాత్రం నా నిజ జీవితంలో ఇవన్నీ చేశాను. ఈ సినిమాలో నా జీవితంలో కొన్ని సంఘటనలు.. వేరే వాళ్ళతో చేస్తూ నేను కూడా రోల్ ప్లే చేశాను. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే నామీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయి” అంటూ తెలిపారు.
ఇకపై ఇదే నా అడ్డా – జగ్గారెడ్డి
“నా జీవితంలో జరిగిన విషయాలనే నేను రాసుకొని ఇప్పుడు మూవీలో చూపించబోతున్నాను. ఈ సినిమా కార్యాలయమే ఇకమీద నా అడ్డా ..రాజకీయంలో నేను పోషించిన పాత్ర, సక్సెస్ ఫుల్ ప్రయాణం, సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్టర్ అన్నీ నేనే” అంటూ జగ్గారెడ్డి తెలిపారు.ఇక సినిమా నుండి విడుదల చేసిన టీజర్ పోస్టర్ అలాగే వీడియో గురించి స్పందిస్తూ.. “ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్. పోలీసులను కొట్టినట్లు హీరోలు నటిస్తారు కదా.. కానీ అవన్నీ నేను ఒరిజినల్ గా చేశాను. ముఖ్యంగా విద్యార్థి నేతగా, కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్గా నా బాధ్యతలు చేపడుతూనే.. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా చూపించనున్నాను. నా రాజకీయ జీవిత కథను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను” అంటూ జగ్గారెడ్డి తెలిపారు. మొత్తానికైతే జగ్గారెడ్డి టైటిల్తో జగ్గారెడ్డి తన సినిమాను తానే రాసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.
ALSO READ:Allu Arjun -Atlee: అన్నతోనైనా తమ్ముడికి కలిసొచ్చేనా..?
జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం..
జగ్గారెడ్డి విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు టి. జయప్రకాష్ రెడ్డి. బీజేపీలో కౌన్సిలర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2004లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2009లో తిరిగి ఎన్నికైన ఈయన మళ్లీ 2014లో ఓడిపోయారు. ఇక బిజెపి అభ్యర్థిగా మెదక్ నుండి 2014 ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి , మళ్ళీ 2015లో కాంగ్రెస్లోకి చేరారు. 2021 జూన్ 28 నుండి తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన ఈయన.. 2018 నుండే 2023 వరకు సంగారెడ్డి నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా కొనసాగారు. ఇకపోతే ఈయన 2004లో భార్య , కుమార్తె, కొడుకు పేర్లపై ఉన్న పాస్ పోర్ట్ లను ఉపయోగించి హైదరాబాద్ నుండి ముగ్గురు వ్యక్తులను అమెరికాకు అక్రమంగా రవాణా చేశాడని ఆరోపణలపై 2018లో ఫోర్జరీ, మోసం, వంచన, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఆయనను అరెస్టు కూడా చేశారు. ఇక ప్రస్తుతం ఈ రాజకీయ జీవిత కథ ఆధారంగానే జగ్గారెడ్డి బయోపిక్ రాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.