BigTV English

Amazon Employees:అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ

Amazon Employees:అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ

Amazon Employees:ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్… మరోసారి ఉద్యోగుల్ని తొలగించింది. ఈసారి బ్రిటన్‌లో సిబ్బంది తొలగింపు ప్రక్రియ చేపట్టింది. బ్రిటన్‌లోని ఆఫీసులు, గౌడౌన్లను అమెజాన్ మూసివేయడంతో… 1200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వ్యాపారాభివృద్ధిలో భాగంగానే గోడౌన్లను మూసివేస్తున్నామని అమెజాన్‌ చెబుతున్నా… ఆర్థిక మాంద్యం భయాలతోనే అమెజాన్ ఉద్యోగుల్ని తొలగించుకుంటూ పోతోందని భావిస్తున్నారు. అందుకే గత వారం కూడా 18 వేల మంది సిబ్బందిని ఇంటికి సాగనంప బోతున్నామని ప్రకటన చేసిందని అంటున్నారు.


వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వ్యాపార నిర్వహణ, అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని ప్రకటించిన అమెజాన్… అందులో భాగంగానే కంపెనీకి చెందిన మూడు పాత గోదాములను మూసివేస్తున్నామని చెప్పింది. ఈ నిర్ణయంతో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు భవిష్యత్తులో ప్రారంభించే కొత్త ఆఫీసుల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ ఏడాదిలో మరిన్ని వ్యాపార సముదాయాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని… వాటి ఏర్పాటుతో కొత్తగా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అమెజాన్‌ బ్రిటన్‌ విభాగం ప్రకటించింది.

కంపెనీ నుంచి 18 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు గత వారమే ప్రకటించిన అమెజాన్… ఆ ప్రక్రియ జనవరి 18 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించాడు. కరోనా సమయంలో ఈ-కామర్స్‌ వ్యాపారం బాగా పుంజుకోవడంతో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అమెజాన్… ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారం నెమ్మదించడంతో… ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. అమెజాన్ మాత్రమే కాదు… గత 3 నెలలుగా అనేక దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్‌, మెటా, గూగుల్, సేల్స్‌ఫోర్స్‌ సహా అనేక కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×