BigTV English

Preterm Babies:- నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లో ఆ సమస్యలు..

Preterm Babies:- నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లో ఆ సమస్యలు..

Preterm Babies:- ఈరోజుల్లో ఆరోగ్య సమస్యలు అనేవి పుట్టినప్పటి నుండే అటాక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. మారుతున్న వాతావరణం వల్ల, ఆహార పరిస్థితుల వల్ల.. ఇలా మరెన్నో అంశాల వల్ల పుట్టినప్పటి నుండే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లలో శ్వాస తీసుకునే సమస్యకు కారణం.. వారు నెలలు నిండక ముందు పుట్టడమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా అలా పుట్టిన పిల్లలో మరెన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు చెప్తున్నారు.


నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులు కనిపిస్తుంటాయి. అయితే పుట్టుకతో మొదలయిన ఆ సమస్యలు కనీసం యవ్వనం వరకు కొనసాగుతాయని శాస్త్రవేత్తలు కనిగొన్నారు. ఫిన్‌లాండ్, నార్వేలో దాదాపు 2.6 మిలియన్ నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలపై వారు స్టడీ చేశారు. వారు ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులైన అస్థమాతో పాటు ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం (సీఓపీడీ)కు గురవుతారని ఈ స్టడీలో తేలింది. కొంతమందికి ఈ సమస్యలు పుట్టినప్పటి నుండి ఉంటాయని, మరికొందరికి మాత్రం టీనేజ్‌లో మొదలవుతాయని వారు నిర్ధారించారు.

ప్రెగ్నెన్సీ సమయంలో 37 వారాలకంటే ముందే పుట్టే పిల్లలతి ప్రీటర్మ్ బర్త్ అంటారు. అంటే నెలలు నిండక ముందు పుట్టడం. అయితే అస్థమా లేదా సీఓపీడీకి గురవుతున్న వారు మరీ ముందుగా అంటే 28 వారాలలోపే పెట్టేస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. మామూలుగా ఒక బేబీ ఆరోగ్యంగా ఉండాలంటే 39 నుండి 41 వారాల మధ్య పుట్టాలని వారు అన్నారు. అందుకే నెలలు నిండక ముందు పుట్టే పిల్లల్లో ఎన్నో విధాలుగా ఊపిరితిత్తుల సమస్య వెంటాడుతుందని వారు తెలిపారు.


ఇప్పటివరకు నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అలా పుట్టడం వల్ల వారి లంగ్ హెల్త్ దెబ్బతింటుందని ఇదివరకే నిర్ధారణ అయ్యింది. కానీ ఆ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఆ సమస్యలు కొనసాగుతాయని తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. కొందరికి ఈ సమస్యలు యవ్వనం వరకు కొనసాగితే.. కొందరికి మాత్రం యవ్వనం దాటిపోయిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటాయి.

పిల్లల్లో అస్థమా రావడానికి కేవలం నెలలు నిండక ముందే పుట్టడం మాత్రమే కాకుండా పెరిగే వాతావరణం, తల్లికి అస్థమా ఉండడం, ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి పొగత్రాగడం లాంటి అంశాలు కూడా కారణమవుతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అస్థమా, సీఓపీడీతో బాధపడుతున్న పేషెంట్ల పుట్టుక గురించి మెడికల్ రికార్డుల్లో ఉండదు. దానివల్ల వారికి ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. అందుకే అలాంటి సమాచారాన్ని కూడా మెడికల్ రికార్డుల్లో చేర్చాలని శాస్త్రవేత్తలు కోరారు.

శరీరంలోని గ్లూకోస్‌తో ఫ్యూయల్ సెల్‌కు ఛార్జింగ్.

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×