BigTV English

Indian Women:భారత్ మహిళలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు..

Indian Women:భారత్ మహిళలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు..

Indian Women:ఈరోజుల్లో పీల్చే గాలి దగ్గర నుండి తినే ఆహారం వరకూ.. ఏదీ ఆరోగ్యకరంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కరిపై ఒక్కొక్క ఎఫెక్ట్ చూపిస్తాయి. మహిళలపై అఫెక్ట్ చూపించే సమస్యలు.. పురుషులలో అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తాజాగా భారతదేశంలో ఎక్కువమంది మహిళలు.. ఏ వ్యాధితో బాధపడుతున్నారో సర్వేలో తేలింది.


భారతదేశంలో 15 నుండి 49 మధ్య వయసున్న ప్రతీ ఎనిమిది మంది మహిళల్లో ఒకరు అనేమియా, ఒబిసిటీ.. ఈ రెండు వ్యాధులతో బాధపడుతున్నట్టుగా ఒక ఫారిన్ జర్నల్ చేసిన స్టడీలో తేలింది. పలువురు భారతీయ పరిశోధకులు కూడా ఈ స్టడీలో పాల్గొన్నారు. ఇండియాలోనే కాకుండా పలు ఇతర దేశాల్లో కూడా మహిళలు ఒకేసారి ఈ రెండు వ్యాధులతో బాధపడుతున్నట్టుగా బయటపడింది. ఈ రెండు వ్యాధులు రావడానికి ఒకే రకమైన కారణాలు ఉండకపోయినా.. ఒకేసారి ఈ రెండు వ్యాధులకు కారణమేంటో తెలుసుకునే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు.

భారత్‌లోని మయన్మార్‌లోని మహిళలను ఎక్కువగా ఈ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మయన్మార్‌లోని యంగై ప్రాంతంలో 15.3 శాతం మహిళలు ఈ వ్యాధులతో బాధపడుతున్నట్టుగా స్టడీలో తేలింది. ఇక ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నేపాల్ ఉంది. నేపాల్‌లోని ప్రోవిన్స్ 1 ప్రాంతంలో 9 శాతం మహిళలకు ఈ వ్యాధులు ఉన్నట్టుగా బయటపడింది. వయసు పెరుగుతున్నకొద్దీ అనేమియా, ఒబిసిటీ వ్యాధులు అటాక్ చేసే అవకాశాలు కూడా పెరుగుతాయని పరిశోధకులు తేల్చారు.


ఆహార అలవాట్లలో మార్పులే మహిళలలో ఈ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం తినే ఆహారంలో ఉప్పు, కారం, చక్కెరలాంటివి ఎక్కువ మోతాదులో ఉండడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని వారు అంటున్నారు. ఆహారంలో ఇలాంటివి ఎక్కువ ఉన్నా సమస్యే.. తక్కువ ఉన్న సమస్యే.. అని వారు చెప్తున్నారు. డైట్ల పేరుతో ఉప్పు, కారం, చక్కెర లాంటివి కనీస మోతాదులో తీసుకోకపోయినా.. ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. పెరిగే ప్రాంతాన్ని బట్టి కూడా అనేమియా సమస్య వస్తుందని బయటపెట్టారు. ఈ వ్యాధులకు ఎలాంటి చికిత్స అందిస్తే కరెక్ట్ అనేవాటిపై మరికొన్ని స్టడీలు చేయాలని పరిశోధకులు తెలిపారు.

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×